AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్ కార్డును స్మార్ట్‌గా వాడటం ఎలా? ఇలా చేస్తే రూపాయి వడ్డీ కట్టాల్సిన పని ఉండదు..

జేబు ఖాళీ అయినా.. సడెన్‌గా షాపింగ్ చేయాలన్నా.. ఇప్పుడు ప్రతి ఒక్కరి వాలెట్‌లోనూ ఉండే బెస్ట్ ఫ్రెండ్ క్రెడిట్ కార్డు. అయితే క్రెడిట్ కార్డు వాడితే అప్పులపాలవుతాం.. భారీగా వడ్డీలు బాదేస్తారు అని భయపడేవాళ్లే ఎక్కువ. కానీ చిన్న లాజిక్ అర్థం చేసుకుని, స్మార్ట్‌గా ప్లాన్ చేస్తే.. ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టకుండా బ్యాంక్ డబ్బులతోనే ఎంజాయ్ చేయొచ్చు. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Credit Card: క్రెడిట్ కార్డును స్మార్ట్‌గా వాడటం ఎలా? ఇలా చేస్తే రూపాయి వడ్డీ కట్టాల్సిన పని ఉండదు..
How To Use Credit Cards Smartly
Krishna S
|

Updated on: Aug 18, 2026 | 12:54 PM

Share

మధ్యతరగతి ఉద్యోగులకు క్రెడిట్ కార్డు అనేది ఎమర్జెన్సీ లైఫ్ లైన్ లాంటిది. ఈ మధ్య వీటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఎవరి జేబులో డబ్బులు లేకున్నా క్రెడిట్ కార్డు స్వైప్ చేయడం కామన్‌గా మారింది. అత్యవసర సమయాల్లో అపద్బాంవుడిగా మారుతున్నాయి. అయితే అధిక వడ్డీ రేట్లు పడతాయనే భయంతో చాలామంది వీటి వినియోగానికి వెనుకాడుతుంటారు. సరైన అవగాహనతో, ఆర్థిక క్రమశిక్షణతో వాడితే ఒక్క రూపాయి కూడా వడ్డీ చెల్లించకుండా క్రెడిట్ కార్డులను పూర్తి ప్రయోజనకరంగా మార్చుకోవచ్చు. అవును.. క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడమే ఇందులో ప్రధాన కిటుకు. బ్యాంకులు కార్డు స్వైప్ చేసిన తేదీని బట్టి దాదాపు 45 నుండి 50 రోజుల వరకు వడ్డీ రహిత గడువును అందిస్తాయి. బిల్లింగ్ తేదీని, డ్యూ డేట్‌ను దృష్టిలో ఉంచుకుని ఖర్చులు చేస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా బ్యాంక్ డబ్బును ఉపయోగించుకోవచ్చు. బిల్లు వచ్చిన తర్వాత గడువు తేదీలోపు మొత్తం బకాయిని పూర్తిగా చెల్లించేస్తే ఒక్క పైసా కూడా వడ్డీ పడదు.

మినిమం డ్యూ వలలో పడకండి

క్రెడిట్ కార్డు బిల్లులో ప్రధానంగా కనిపించే అంశం మినిమం అమౌంట్ డ్యూ. ఇది సాధారణంగా మొత్తం బిల్లులో 5 నుంచి 10 శాతం ఉంటుంది. కేవలం మినిమం బ్యాలెన్స్ మాత్రమే చెల్లిస్తే, మిగిలిన మొత్తం బకాయిపై బ్యాంకులు ఏటా 36 నుండి 45శాతం వరకు భారీ వడ్డీని వసూలు చేస్తాయి. బకాయి ఉండిపోతే, తదుపరి చేసే ప్రతి కొత్త కొనుగోలుపై మొదటి రోజు నుంచే వడ్డీ లెక్కించడం మొదలవుతుంది. కేవలం మినిమం అమౌంట్ మాత్రమే చెల్లిస్తూ పోతే అప్పుల భారం పెరిగి క్రెడిట్ స్కోర్ దెబ్బతినే ప్రమాదం ఉంది.

తెలివైన క్రెడిట్ కార్డు వినియోగానికి చిట్కాలు

టోటల్ అమౌంట్ మాత్రమే కట్టండి: డ్యూ డేట్ కంటే 2-3 రోజుల ముందే టోటల్ అమౌంట్ డ్యూ పూర్తిగా చెల్లించేలా చూసుకోండి.

ఆటో-డెబిట్ ఫీచర్: బిల్లు చెల్లింపుల తేదీని మర్చిపోకుండా ఉండేందుకు మీ బ్యాంక్ ఖాతాకు ఆటో డెబిట్ ఎంపికను అనుసంధానించండి.

క్రెడిట్ వినియోగ నిష్పత్తి: కార్డు పరిమితిలో 30 శాతం కంటే ఎక్కువ వాడకపోవడం మంచి క్రెడిట్ స్కోర్‌కు ఎంతో అవసరం.

వార్డు పాయింట్లు – క్యాష్‌బ్యాక్‌లు: సమయానికి బిల్లులు చెల్లిస్తూ కార్డు అందించే రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి అదనపు ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవచ్చు.

క్రెడిట్ కార్డు అనేది ఉచిత అప్పు కాదు.. అది ఒక ఆర్థిక సాధనం మాత్రమే. ఖర్చులపై నియంత్రణ, సరైన సమయంలో పూర్తి చెల్లింపులు పాటిస్తే క్రెడిట్ కార్డు మీ జేబుకు ఎంతో లాభదాయకంగా మారుతుంది.

Follow Us