AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haripriya: ‘మా ఇద్దరినీ కలిపింది ఆ కుక్కపిల్లే’.. తమ ప్రేమ రహస్యం రివీల్ చేసిన స్టార్ హీరోయిన్..

Haripriya And Vasishta Simha: తెలుగులో నటించింది కొన్ని సినిమాలో అయినా ప్రేక్షుకుల్లో మంచి గుర్తింపు పొందింది కన్నడ బ్యూటీ హరిప్రియ. తకిట తకిట సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అమ్మడు..

Haripriya: ‘మా ఇద్దరినీ కలిపింది ఆ కుక్కపిల్లే’.. తమ ప్రేమ రహస్యం రివీల్ చేసిన స్టార్ హీరోయిన్..
Actress Hari Priya
Shiva Prajapati
|

Updated on: Dec 07, 2022 | 9:48 AM

Share

తెలుగులో నటించింది కొన్ని సినిమాలో అయినా ప్రేక్షుకుల్లో మంచి గుర్తింపు పొందింది కన్నడ బ్యూటీ హరిప్రియ. తకిట తకిట సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అమ్మడు.. నాచురల్ స్టార్ నాని సరసన పిల్ల జమిందార్, నటసింహం బాలయ్యతో జై సింహ, వరుణ్ సందేశ్‌తో ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ వంటి సినిమాల్లో నటించి తెలుగునాట మంచి గుర్తింపు పొందింది. అయితే, ఈ అమ్మడు.. తెలుగు సినిమాల్లో కంటే.. కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించింది. రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, శ్రీమురళి వంటి స్టార్ హీరోల సరసన నటించింది. కన్నడ సినిమాల్లో నటించిన హరిప్రియ.. అనేక అవార్డులను కూడా గెలుచుకుంది. తన సహచర నటుడు వశిష్ట సింహంను ప్రేమించిన ఈ అమ్మడి నిశ్చితార్థం ఇటీవలే జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. తాజాగా వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? తమ మధ్య ప్రేమ పుట్టడానికి గల కారణం ఏంటి? అనే ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది హరిప్రియ. తమ మధ్య ప్రేమ చిగురించడానికి కారణం ఒక్క కుక్కపిల్ల అని చెప్పింది. ఇన్‌స్టాగ్రమ్‌లో తమ లవ్‌స్టోరీని రివీల్ చేసింది అమ్మడు.

హరిప్రియ, వశిష్ట సింహ జంటగా ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అంతా భావించారు. అయితే, అసలు కథ వేరే ఉందంటూ ఇన్‌స్టాగ్రమ్ వేదికగా తమ ప్రేమ రహస్యాన్ని రివీల్ చేసింది హరిప్రియ. వారి ప్రేమ కథ ఒక కుక్కపిల్లతో మొదలైందని, తమను క్రిస్టల్ అనే కుక్కపిల్ల ఒక్కటి చేసిందని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

‘హరిప్రియకు లక్కీ, హ్యాపీ అనే రెండు కుక్కలు ఉన్నాయి. ఇంతలో లక్కీ అనే కుక్క చనిపోయింది. దాంతో హ్యాపీ ఒంటరి అయిపోయాడు. హరిప్రియ కూడా లక్కీని కోల్పోయి చాలా బాధపడుతుండేది. ఈ సమయంలో హరిప్రియకు క్రిస్టల్ అనే కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చాడు వశిష్ట సింహ. కొత్తగా వచ్చిన క్రిస్టల్‌తో హ్యాపీ ఫ్రెండ్‌షిప్ చేయడానికి కాస్త సమయం పట్టింది. ఇప్పుడు ఆ రెండూ కలిసి చాలా సంతోషంగా ఉన్నాయి.’

‘ఇక్కడ రహస్యం ఏంటంటే.. వశిష్ట ఈ కుక్కను బహుమతిగా ఇచ్చినప్పుడు.. దాంతోపాటు ఒక సందేశాన్ని కూడా తీసుకువచ్చాడు. క్రిస్టల్ కడుపుపై గుండె ఆకారంలో మచ్చ ఉంది. క్రిస్టల్ పెరుగుతున్నా కొద్ది.. ఆ గుర్తు కూడా పెరుగుతూ వచ్చింది. దాంతోపాటే.. మా మధ్య ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది. అలా క్రిస్టల్ మా ప్రేమకు అద్దం పట్టింది.’ అని హరిప్రియ తమ లవ్ మ్యాటర్ రివీల్ చేసింది. వీరి లవ్ స్టోరీ విన్న అభిమానులు.. వశిష్ట, హరిప్రియలకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

View this post on Instagram

A post shared by Hariprriya (@iamhariprriya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..