AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhamki Movie: ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల’ సాంగ్ లాంచ్ చేసిన రానా దగ్గుబాటి, సిద్ధు జొన్నలగడ్డ..

హిందీ వెర్షన్ ఆల్మోస్ట్ దిల్ కా పథ మిలా పాటని రానా దగ్గుబాటి లాంచ్ చేయగా, తెలుగు వెర్షన్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల పాటను సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. లియోన్ జేమ్స్ స్కోర్ చేసిన ట్యూన్ చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది.

Dhamki Movie: 'ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల' సాంగ్ లాంచ్ చేసిన రానా దగ్గుబాటి, సిద్ధు జొన్నలగడ్డ..
Dhamki Movie
Rajitha Chanti
|

Updated on: Dec 07, 2022 | 10:46 AM

Share

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఇందులో విశ్వక్ టైటిల్ రోల్ పోషిస్తుండటంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విశ్వక్ సేన్ కనిపించిన ‘దాస్ కా ధమ్కీ’ థియేట్రికల్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ తో సినిమా మ్యూజిక్ ప్రమోషన్‌ లను ప్రారంభించారు. హిందీ వెర్షన్ ఆల్మోస్ట్ దిల్ కా పథ మిలా పాటని రానా దగ్గుబాటి లాంచ్ చేయగా, తెలుగు వెర్షన్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల పాటను సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. లియోన్ జేమ్స్ స్కోర్ చేసిన ట్యూన్ చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది. పాట కోసం ఫారిన్ లోకేషన్స్ లోషూట్ చేసిన స్టైలిష్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

విశ్వక్ సేన్ స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌ లు, నివేదా పేతురాజ్ గ్లామ్ టచ్ థియేటర్‌ లలో ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. . లియోన్ జేమ్స్ , ఆదిత్య ఆర్కే లైవ్లీగా పాడగా, పూర్ణా చారి సాహిత్యం ఆకట్టుకుంది. హిందీ వెర్షన్‌కి అమితాబ్ వర్మ సాహిత్యం అందించగా, లియోన్ జేమ్స్‌తో కలిసి నకాష్ అజీజ్ ఆలపించారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య తారాగణం ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 17, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..