AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Balakrishna: బాలయ్యా మజాకా..! నటసింహం అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్.. అదేంటంటే

ప్రాంతం ఏదైనా.. ప్రోగ్రాం ఎక్కడైనా జై బాలయ్య నినాదాలు మారుమ్రోగుతూనే ఉంటాయి. ఒక వైపు హీరోగా రాణిస్తూనే.. మరో వైపు ఓటీటీ స్టార్ టాక్ షో అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా చేస్తున్నారు నటసింహం.

Nandamuri Balakrishna: బాలయ్యా మజాకా..! నటసింహం అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్.. అదేంటంటే
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Dec 07, 2022 | 3:39 PM

Share

నటసింహం నందమూరి బాలయ్య సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. తెలుగురాష్ట్రాల్లో బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాంతం ఏదైనా.. ప్రోగ్రాం ఎక్కడైనా జై బాలయ్య  నినాదాలు మారుమ్రోగుతూనే ఉంటాయి. ఒక వైపు హీరోగా రాణిస్తూనే.. మరో వైపు ఓటీటీ స్టార్ టాక్  షో అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా చేస్తున్నారు నటసింహం. బాలకృష్ణలో చాలా మందికి తెలియని కొత్తకోణాన్ని చూపింది ఈ టాక్ షో. ఇక అఖండ లాంటి భారీ విజయంతో బాలకృష్ణ 200కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు. దాంతో ఆయన నెక్స్ట్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలను లైనప్ చేశారు. వాటిలో గోపీచంద్ మలినేని సినిమా ఒకటి.. మరొకటి అనిల్ రావిపూడి మూవీ. తాజాగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన అదిరిపోయే రెండు గుడ్ న్యూస్లు వచ్చేశాయి.

బాలయ్యతో సినిమా అంటే ఎలా ఉంటుంది.. మాములుగా ఉండదు. అభిమానులకు పూనకాలు తెప్పించే యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఉండాలి. సరిగ్గా అలాంటి కథతోనే సినిమా చేస్తున్నాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాకు వీరసింహా రెడ్డి అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, గ్లిమ్ప్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను  బరిలోకి దింపనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశారు.

అలాగే సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తో సినిమా చేస్తున్నారు బాలయ్య. ఇటీవలే ఎఫ్3 సినిమాతో హిట్ అందుకున్న అనిల్. ఇప్పుడు బాలకృష్ణ కోసం ఓ అదిరిపొయ్యే కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ కు కావాల్సిన మాస్ మాసాలతో పాటు తనదైన కామెడీని కూడా యాడ్ చేయనున్నాడట అనిల్. ఇక ఈ సినిమానుంచి కూడా ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ మూవీ రేపు (డిసెంబర్ 8న )పూజాకార్యక్రమాలు జరుపుకోనుంది. రేపు ఉదయం 9.36నిమిషాలకు ముహూర్తం అంటూ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇలా ఒకే సారి రెండు గుడ్ న్యూస్ లు తెలియడంతో నందమూరి అభిమానుల్లో ఉత్సహం రెట్టింపు అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్