AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: తమన్ వ్యాఖ్యలపై చిరంజీవి రియాక్షన్.. ట్వీట్ వైరల్..

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన డాకు మహారాజ్ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.

Megastar Chiranjeevi: తమన్ వ్యాఖ్యలపై చిరంజీవి రియాక్షన్.. ట్వీట్ వైరల్..
Chiranjeevi, Thaman
Rajitha Chanti
|

Updated on: Jan 18, 2025 | 12:33 PM

Share

సంక్రాంతి పండక్కి అడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రాల్లో డాకు మహారాజ్ ఒకటి. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో హీరో బాలకృష్ణ నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించగా.. తమన్ అందించిన మ్యూజిక్ హైలెట్ అయ్యింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో సక్సెస్ పార్టీ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలో తమన్ మాట్లాడుతూ.. ఆన్ లైన్ నెగిటివిటీ సినిమాపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తమన్ కామెంట్స్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

” డియర్ తమన్.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా  అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు  నడిపిస్తుంది” అంటూ ట్వీట్ చేశారు.

డాకు మహరాజ్ సినిమా సక్సెస్ మీట్‏లో తమన్ మాట్లాడుతూ.. “ట్రోలర్స్ ని చూస్తుంటే భయంగా సిగ్గుగా ఉంది. తెలుగు సినిమా ఫ్లయింగ్ హై … షైన్ లో ఉంది. సినిమాని కాపాడడం మన అందరి బాధ్యత. ప్రొడ్యూసర్ బాగుండాలి అని ఇండస్ట్రీ లో ప్రతి ఒక్కరు కోరుకోవాలి. నెగిటివ్ ట్రోల్స్ అనేది భయంగా, సిగ్గుగా ఉంది. నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతుంది. ప్రతి హీరో ఎంతో కష్టపడుతున్నారు. ప్రతి హీరో ఫ్యాన్ కి ఎంతో బాధ్యత ఉంది. నెగిటివిటీ ని స్ప్రెడ్ చేయొద్దు. హిందీ మలయాళ కన్నడ వాళ్ళు మన తెలుగు సినిమా చేయాలి అని నన్ను అడుగుతూ ఉంటారు. తెలుగు సినిమాకి ఇతర భాషల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంతో గౌరవం ఉంది. ట్రోల్స్ తో మన పరువుని మనమే తీసుకోవద్దు” అని అన్నారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..