Krishna Passes Away: మాటలకు అందని విషాదం ఇది.. కృష్ణ మృతి పై ఎమోషనల్ అయిన మెగాస్టార్
కృష్ణ మృతికి సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్ర గవర్నర్, సీఎం జగన్ నివాళులు అర్పించారు.
![Krishna Passes Away: మాటలకు అందని విషాదం ఇది.. కృష్ణ మృతి పై ఎమోషనల్ అయిన మెగాస్టార్](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/11/chiranjeevi-krishna.jpg?w=1280)
సూపర్ స్టార్ కృష్ణ కన్నుమృతితో సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. కార్డియాక్ అరెస్ట్ తో హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పటల్ లో చేరిన కృష్ణ నేడు తెల్లవారుజామున 4గంటలకు కన్నుమూశారు. కృష్ణ ఎం మరణవార్త విని ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. కృష్ణ మృతికి సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్ర గవర్నర్, సీఎం జగన్ నివాళులు అర్పించారు. ఇక కొందరు సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా లో స్పందిస్తూ..
“మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి వూపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం..వీటి కలబోత కృష్ణ గారు.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/11/superstar-krishna-1.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/11/super-star-krishna-1.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/11/super-star-krishna-2.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/11/superstar-krishna-demise.jpg)
అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమ లోనే కాదు, భారత సినీపరిశ్రమ లోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ,అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియ చేసుకొంటున్నాను.. అంటూ మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 15, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..