Super Star Krishna: కృష్ణకు సూపర్ స్టార్ బిరుదు వచ్చేలా చేసింది ఈ సినిమాలే.. ఆయన పేరు చెబితే ఇవే గుర్తుకువస్తాయ్

సినీ సింహాసనాధీశుడు..సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన ప్రతి సినిమా అద్భుతమే.. అందులోని ప్రతి పాత్రది ప్రేక్షకుల మదిలో చిరస్థానమే..కానీ..ఈ అద్భుతాలలోనుంచి ఏరిన మరో పది ఆణిముత్యాలే ఈ టాప్‌ టెన్‌ సూపర్‌ స్టార్‌ క్యారెక్టర్స్.. జమదగ్నిగా.. అల్లూరి సీతారామారాజుగా, మోసగాళ్లకు మోసగాడుగా, నెంబర్‌వన్‌గా ఘట్టమనేని శివరామ కృష్ణ వెండితెరను ఏలిన అజరామర నటుడు..

Super Star Krishna: కృష్ణకు సూపర్ స్టార్ బిరుదు వచ్చేలా చేసింది ఈ సినిమాలే.. ఆయన పేరు చెబితే ఇవే గుర్తుకువస్తాయ్
Super Star Krishna
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 15, 2022 | 7:19 AM

సూపర్‌ స్టార్‌ కృష్ణ 3 వందలకు పైగా సినిమాలు చేశారు. హీరోగా, నిర్మాతగా, ఎడిటర్‌గా, దర్శకుడిగా, సమర్పకుడిగా ఆయన చేయని రంగమే లేదు. 24 క్రాఫ్ట్స్‌ను కంట్రోల్‌ చేస్తూ.. పవర్‌ పాత్రల్లో జీవించారు. జమదగ్ని సినిమాలో జర్నలిస్టుగా నటించారు కృష్ణ.. ఈ పాత్ర గురించి ఇప్పటికీ నేటి జర్నలిస్టులు చెప్పుకుంటూనే ఉంటారు. అగ్నిపర్వతం.. సినిమా రంగంలో కృష్ణ ఒక పర్వతం లాంటి మనిషని చెప్పే సినిమా.. డేరింగ్‌ డాషింగ్‌ హీరో..ఎవరికీ తలవంచని.. తల దించని పర్వతం ఈ నట శిఖరం..

అల్లూరి సీతారామరాజు.. ఎన్టీఆర్‌ చేయాలనుకున్న పాత్రను.. సవాల్‌గా తీసుకుని..ప్రాణం పెట్టి మరీ తీసిన సినిమా ఇది.. ఈ సినిమాలో కృష్ణలోని నటన ఆ సేతు హిమాచలమే.. రూథర్‌ ఫర్డ్‌ అని ఆయన చెప్పిన డైలాగులు..ఆ సీన్లు..నెవర్‌ బిఫోర్‌.. నెవర్‌ ఆఫ్టర్. ఈనాడు సినిమా ఓ ప్రభంజనం..వెండితెరను ఊరేసిన కృష్ణ నట సముద్రం. మాయదారి మల్లిగాడు.. సినిమా రంగం మొదలైనప్పటి నుంచీ.. సినిమా ఉన్నంతవరకు మాయదారి మల్లిగాడు సినిమా గురించి చెప్పుకోవాల్సిందే. ఊరికి మొనగాడు సినిమా ఎంత హిట్టయ్యిందో తెలియంది కాదు. ఈ సినిమా హిందీలో కూడా బ్లాక్‌ బస్టరే. మోసగాళ్లకు మోసగాడు.. కౌబాయ్‌ గెటప్‌లో సిల్వర్‌ స్క్రీన్‌పై ఆయన చేసిన ప్రయోగం ఎప్పటికీ ట్రెండ్‌ సెట్టరే.. అప్పట్లో ఈ మూవీ ఎంత సెన్సేషన్‌ సృష్టించిందో.. ఆ తర్వాత హీరోలకు ఎంత మార్గదర్శకత్వంగా నిలిచిందో మాటల్లో చెప్పలేం.

ఇక రైతు నాయకుడిగా ప్రజారాజ్యంలో అద్భుత నటనతో ఆలోచింపజేశారు. పాడి పంటలు సినిమాలో రైతుగా అలరించారు. సింహాసనంలో రాజకుమారుడిగా ఆయన చేసిన సాహసం..నభూతో నభవిష్యత్‌. నాన్‌స్టాప్‌గా సినిమాలు చేసే కృష్ణ ఒకానొక దశలో కాస్త వెనుకబడినా..మళ్లీ నెంబర్‌ వన్‌తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశారు. తానెప్పటికీ నెంబర్‌ వన్నేనని నిరూపించారు. ఇలా ఎన్నో సినిమాల్లో ఆయన మరపురాని పాత్రలు పోషించారు. ప్రతి పాత్రలోనూ జీవించారు..సంచలనాలకు సెంటరాఫ్‌ హీరో అయిన సూపర్‌ స్టార్‌ కృష్ణ..సిల్వర్‌ స్క్రీన్‌కు ఆరోజుల్లోనే టెక్నాలజీని పరిచయం చేశారు. 70 ఎంఎంను పరిచయం చేసిందే కృష్ణ.. ఇలా ఒక్కటేంటి.. కృష్ణ సినిమా జర్నీలో ప్రతిదీ ఓ సంచలనమే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..