Superstar Krishna: సినిమాలతో అనేక ప్రయోగాలను చేసిన నటశేఖరుడు.. జీవిత విశేషాలు.. అవార్డులు

కృష్ణ సినిమాల్లోకి అడుగు పెట్టక ముందే ఆయన 19వ ఏట అంటే 1962లో ఇందిరాదేవితో పెళ్ళి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు రమేష్‌బాబు, మహేష్‌బాబు, ముగ్గురు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని

Superstar Krishna: సినిమాలతో అనేక ప్రయోగాలను చేసిన నటశేఖరుడు.. జీవిత విశేషాలు.. అవార్డులు
Super Star Krishna
Follow us
Surya Kala

|

Updated on: Nov 15, 2022 | 11:16 AM

సూపర్ స్టార్ కృష్ణ వెండి తెరపై  చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు. తన 57 ఏండ్ల కెరీర్‌లో 350కిపైగా చిత్రాల్లో నటించిన కృష్ణ సినీ పరిశ్రమలో ఏ హీరో చేయనని సాహసాలు చేశారు.  వాస్తవంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే కారణం కృష్ణ అని చెప్పవచ్చు అని పలువురు సినీ ప్రముఖులు అంటారు. అవును పౌరాణికాలు, జానపదాలు, చారిత్రక నేపథ్యాలు, ప్రేమకథలు, ఫ్యామిలీ ఇలా అన్ని జోనర్స్ లోనూ నటించారు. అంతేకాదు వాటిల్లో కమర్షియల్‌ అంశాలు జోడించి సూపర్ హిట్స్ అందుకున్నారు. అప్పట్లో ఏడాదిలో కృష్ణ సినిమాలు రిలీజ్ కానీ థియేటర్స్ ఉండేవి అంటే అతిశయోక్తి కాదేమో. కృష్ణ చేసిన ప్రయోగాలు.. సాహసాలు మరే హీరో చేయలేదేమో.. అందుకే సాహసమే ఆయన ఊపిరి అంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడు ట్రెండ్‌సెట్టర్‌ అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి.

కృష్ణ జీవిత విశేషాలు:

సూపర్‌స్టార్‌ కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.. 1942 మే 31న బుర్రిపాలెంలో జన్మించారు. ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ ఆయన తల్లిదండ్రులు. నటశేఖరుడు, సూపర్‌స్టార్‌గా పాపులర్‌.. నటుడు మురళీ మోహన్‌, దర్శకుడు క్రాంతికుమార్‌ డిగ్రీ టైమ్‌లో కృష్ణకు రూమ్‌మేట్స్‌ కూడా అనంతరం నాటకాల ద్వారా శోభన్ బాబు పరిచయం అయింది. సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన తర్వాత మురళీమోహన్‌, శోభన్‌బాబు స్నేహితులయ్యారు. కృష్ణ జీవితంలో అసలైన ప్రాణ స్నేహితులు వీళ్ళిద్దరే.. ఇక కృష్ణ సినిమాల్లోకి అడుగు పెట్టక ముందే ఆయన 19వ ఏట అంటే 1962లో ఇందిరాదేవితో పెళ్ళి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు రమేష్‌బాబు, మహేష్‌బాబు, ముగ్గురు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. కృష్ణ పెద్ద కుమారుడును రమేష్‌ బాబు తొలుత నటుడిగా రాణించి ఆ తర్వాత నిర్మాతగా మారారు.. మంజుల కూడా నటిగా, నిర్మాతగా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది. కృష్ణ రెండో కుమారుడు ప్రిన్స్ మహేష్‌బాబు బాలనటుడిగా అడుగు పెట్టి.. హీరోగా మరి ఇప్పుడు స్టార్ హీరోగా  రాణిస్తున్నారు. అయితే 1969లో ‘సాక్షి’ సినిమా ద్వారా పరిచయమైన కథానాయిక విజయనిర్మలను .. పెద్ద భార్య ఇందిర అంగీకారంతో ద్వితీయ వివాహం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

కృష్ణ భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉన్న కథానాయకుడు. 1965లో తేనె మనసులుతో హీరోగా అడుగు పెట్టి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. అయినప్పటికీ కేరీర్ మొదట్లో కులగోత్రాలు, పదండి ముందుకు, పరువు ప్రతిష్ట వంటి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశారు. సాంకేతికంగా ఎప్పుడూ ముందుండాలనుకునే కృష్ణ తన సినిమాలతో తెలుగు వెండి తెరపై అనేక ప్రయోగాలను చేశారు.

తొలి సినిమా స్కోప్‌ సినిమా – అల్లూరి సీతారామరాజు తొలి సినిమా స్కోప్‌ సాంఘిక సినిమా దేవదాసు తొలి సినిమా స్కోప్‌ పౌరాణిక సినిమా కురుక్షేత్రం తొలి సినిమా స్కోప్‌ జేమ్స్ బాండ్‌ మూవీ ఏజెంట్‌ గోపి తొలి సినిమా స్కోప్‌ కౌబాయ్‌ సినిమా దొంగలదోపిడి.. పూర్తీ స్థాయిలో మోసగాళ్లకు మోసగాడు తొలి ఈస్ట్ మాన్‌ కలర్‌ సినిమా – ఈనాడు తొలి 70 ఎంఎం సినిమా – సింహాసనం తొలి డీటీయస్‌ సినిమా – తెలుగు వీర లేవరా

కౌబోయ్‌ జోనర్‌ని తెలుగు స్క్రీన్‌కి పరిచయం చేసిన హీరో కృష్ణ అప్పట్లోనే పాన్ ఇండియా సినిమాగా పలు భాషల్లో మోసగాళ్లకు మోసగాడు సినిమాను రిలీజ్ చేశారు. అన్ని భాషల్లోనూ ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.  గూఢచారి 116, జేమ్స్ బాండ్‌ 777, ఏజెంట్‌ గోపి, రహస్యగూఢచారి, గూఢచారి 117 వంటి స్పై సినిమాల్లోనూ నటించి సూపర్ హిట్ అందుకున్నారు. నటుడు మాత్రమే కాదు.. అభిరుచి గల నిర్మాత, దర్శకుడు కూడా..  17 చిత్రాలకు దర్శకత్వం వహించిన కృష్ణ.. సొంతంగా పద్మాలయ స్టూడియోస్‌ ప్రొడక్షన్‌ కంపెనీని స్థాపించి అనేక సినిమాలను నిర్మించారు.

మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు సినిమాలకు అభిమానులు ఫిదా.. అల్లూరి సీతారామరాజుకు నంది అవార్డు అందుకున్నారు.. అల్లూరి సీతారామరాజు హిట్ తర్వాత వరుసగా 14 ఫ్లాపులు చూసినా.. మళ్ళీ పాడిపంటలు చిత్రంతో సక్సెస్ ట్రాక్ ను సొంతం చేసుకున్నారు. ఆదుర్తి సుబ్బారావు, వి.మధుసూదనరావు, కె.విశ్వనాథ్‌, బాపు, దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావులతో అనేక సూపర్ హిట్ సినిమాలను అందుకున్నారు. 48 సినిమాల్లో విజయనిర్మల హీరోయిన్‌గా నటించగా.. తర్వాత  47 చిత్రాల్లో జయప్రద నాయికగా నటించారు.

అవార్డులు: 2008లో ఆంధ్రయూనివర్సిటీ ‘గౌరవ డాక్టరేట్‌’తో ఆయన్ని ఘనంగా సత్కరించింది. భారతీయ సినిమాకు చేసిన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2009లో పద్మభూషణ్‌ పురస్కారం ప్రధానము చేసింది. 2003లో ఎన్టీఆర్‌ జాతీయ అవార్డును అందుకున్నారు. అంతేకాదు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను ఫిల్మ్‌ ఫేర్‌ లైఫ్‌ ఎఛీవ్‌మెంట్‌ పురస్కారం సైతం కృష్ణని వరించింది. దక్షిణాదిన అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో 1997వ సంవత్సరానికి ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డును అందుకున్నారు. కృష్ణ కెరీర్ తొలిరోజుల్లో నటించిన ‘సాక్షి’ చిత్రం 1968లో తాష్కెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్లో ప్రదర్శించారు. 1972లో ఆయన నటించిన ‘పండంటి కాపురం’ చిత్రం ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా ఎంపికై నేషనల్‌ అవార్డుని కూడా కైవసం చేసుకుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్  వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..