AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు.. శోక సంద్రంలో సినీ పరిశ్రమ, కుటుంబ సభ్యులు, అభిమానులు

కృష్ణ మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు కృష్ణ త్వరగా కోలుకోవాలని చేసిన ప్రార్ధనలు ఫలించలేదు. చికిత్స పొందుతున్న ఆయన తెల్లవారు జామున 4 గంటలకు మృతి  చెందారు.

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు.. శోక సంద్రంలో సినీ పరిశ్రమ, కుటుంబ సభ్యులు, అభిమానులు
Super Star Krishna
Surya Kala
|

Updated on: Nov 15, 2022 | 7:21 AM

Share

సూపర్ స్టార్ కృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున 4 గంటలకు మృతి  చెందారు. కార్డియాక్‌ అరెస్ట్‌తో కాంటినెంటల్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న కృష్ణ మరణించారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ పరిస్థితి విషమించడంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి ట్రీట్‌మెంట్‌ అందించారు.  24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని ఇప్పటికే వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే..

అయితే కృష్ణ మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. తండ్రి మృతితో తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు , కుమార్తెలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు .హాస్పిటల్ నుంచి  కుటుంబ సభ్యులైన నరేష్, హీరో సుదీర్ బాబు, కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ లు వెళ్లిపోయారు. సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు కృష్ణ త్వరగా కోలుకోవాలని చేసిన ప్రార్ధనలు ఫలించలేదు. కృష్ణ మృతితో ఆయన స్వగ్రామం బుర్రిపాలెం లో విషాదం నెలకొంది.

కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆలాగే ఆయన రెండో భార్య విజయ నిర్మల, పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి

1943, మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో  ఘట్టమనేని శివరామకృష్ణ జన్మించారు. 1960లో ఏలూరు సి.ఆర్‌.రెడ్డి. కాలేజీలో బిఎస్సీ డిగ్రీ పట్టాను అందుకున్నారు. కృష్ణ పాతాళభైరవి సినిమా చూసి.. ఎన్టీఆర్ కు అభిమానిగా మారారు. ఏఎన్నార్‌, సావిత్రి నటించిన ‘దేవదాసు’ శతదినోత్సవ వేడుకల్లో తెనాలికి వచ్చిన ఏఎన్నార్‌, సావిత్రిలు.. క్రేజ్ ను చూసిన కృష్ణకు నటనపై ఆసక్తి కలిగింది. అప్పుడే తాను కూడా హీరోగా మారాలని నిశ్చయించుకున్నట్లు కృష్ణ పలు సందర్భాల్లో తెలిపారు.

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్ స్టార్ కృష్ణ అయితే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్ స్టార్ కృష్ణ.. సినిమాలో రాణించాలంటే నాటకాల్లో ఫ్రూవ్‌ చేసుకోవాలని కొంతమంది సినీ ప్రముఖులు ఇచ్చిన సలహాతో నాటకాల్లో వేషాలు వేయడం ప్రారంభించారు. 1960లో ‘చేసిన పాపం కాశీకెళ్ళినా’ అనే నాటకంతో కృష్ణ నటుడిగా తొలిసారిగా స్టేజ్ ఎక్కారు. అయితే ఇదే నాటకంలో శోభన్‌బాబు కూడా నటించడం విశేషం.. ఆ తర్వాత ‘భక్త శబరి’, ‘సీతారామ కళ్యాణం’, ‘ఛైర్మన్‌’ వంటి నాటకాల్లో నటించారు.

అయితే వెండి తెరపై నటుడిగా అడుగు పెట్టె అవకాశం ‘కొడుకులు కోడళ్ళు’ చిత్రంతో వచ్చింది. కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమా ఆగిపోయింది. ‘తేనె మనసులు’ కోసం నూతన నటీనటులు కావాలనే పేపర్‌ యాడ్‌ చూసి ఆడిషన్‌కి వెళ్ళి ఎంపికయ్యారు శివరామ కృష్ణ. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలి చిత్రంతోనే నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు. తొలి చిత్రం సాధించిన విజయంతో కృష్ణ వెను దిరిగి చూసుకోలేదు.. 1968 నుంచి 74 వరకు ఒక్కో ఏడాది దాదాపు పదికిపైగా చిత్రాలు విడుదల అయ్యాయి. ఆ టైమ్‌లో తెనాలిలో ఉన్న ఏడు థియేటర్లలో అన్నీ కృష్ణ సినిమాలే ఆడేవంటే అతిశయోక్తి కాదు.. రోజుకి మూడు షిప్ట్‌ల చొప్పున బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాల్లో నటించిన ఘనత కృష్ణదే.. నిర్మాతల హీరోగా పేరొందిన కృష్ణని అభిమానులు ముద్దుగా ‘సూపర్‌స్టార్‌’ అని పిలుచుకుంటారు. 350 పైగా చిత్రాల్లో ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక,జేమ్స్‌బాండ్, కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో మెప్పించిన సూపర్ స్టార్..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..