Daaku Maharaaj OTT: నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి డాకు మహారాజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ డాకు మహారాజ్. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన ఈమాస్ యాక్షన్ చిత్రం సంక్రాంతి కానుకగా అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతికి కానుకగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. ఇటీవల సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో శ్రద్ధా శ్రీనాద్, ప్రగ్యా జైస్వాల్ హీరోయన్లుగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోస్ సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించాయి. విడుదలకు ముందే పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ద్వారా సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ కొల్లగొట్టింది. అలాగే ఈ సినిమాకు మరో హైలెట్ తమన్ అందించిన మ్యూజిక్. బాలయ్య, తమన్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇందులో బాలీవుడ్ స్టార్ ఊర్వశీ రౌటేలా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే డాకు మహరాజ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో నెల రోజులు పూర్తైన ఇప్పటికీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై స్పష్టత రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. నిత్యం ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఏదోక రూమార్ చక్కర్లు కొట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్.
ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బాలయ్య కెరీర్ లో హయ్యేస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
#DaakuMaharaaj, out on 21 Feb on Netflix. pic.twitter.com/MhfvrQazXv
— 𝗙𝗶𝗹𝗺𝘆 𝗩𝗶𝗲𝘄 (@filmy_view) February 16, 2025
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన