Chiranjeevi: రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ విషయాన్ని మర్చిపోయాయి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.

Chiranjeevi: రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ విషయాన్ని మర్చిపోయాయి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్..
Chiranjeevi
Follow us

|

Updated on: Nov 17, 2021 | 10:58 AM

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. అలాగే ఆ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ డైరెక్షన్‌లో భోళా శంకర్, అలాగే బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఓ ప్రముఖ అవార్డుల కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ మాట్లాడుతూ.. ఇలాంటి అవార్డులు అందివ్వాలన్న కోరిక మనసులో బలంగా ఉంటేనే ఏదైనా చేయగలం అన్నారు. నిజంగా సినిమా కళాకారులకు అవార్డులు అనేవి ఓ గొప్ప ఉత్సహాన్ని ఇచ్చే వేడుక. నిజానికి ఇలాంటి అవార్డు వేడుకలు ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం సినిమా కళాకారులను అవార్డులు అందించి సత్కరించాలి. కానీ రాష్ట్రం విడిపోయిన తరువాత అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ అవార్డు వేడుకల విషయం మరచిపోయాయి. ఇకపై అయినా ఈ రెండు ప్రభుత్వాలు అలోచించి అవార్డు వేడుకలు నిర్వహిస్తే మంచిది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చిరు.

ఇక ఇదే కార్యక్రమానికి హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగు చిత్రపరిశ్రమ ఈ మధ్య దేశ వ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకుంటుంది. మన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవుతున్నాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా రంగానికి గొప్ప ప్రోత్సహం అందించే దిశగా ఎప్పుడు ముందు ఉంటుంది అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Venkatesh : ఈ సినిమాలో చాలా సీన్స్ నా హృదయానికి దగ్గరగా ఉన్నాయన్న విక్టరీ వెంకటేష్..

Suriya: హీరో సూర్యకు బెదిరింపులు.. ఆర్మ్డ్ పోలీస్‌లతో కట్టుదిట్టమైన భద్రత.. అసలు విషయం ఏంటంటే..

Sampoornesh Babu: “క్యాలీ ఫ్లవర్”తో మగాళ్లకు రక్షణ కల్పిస్తానంటున్న సంపూర్ణేష్ బాబు..

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?