AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: హీరో సూర్యకు బెదిరింపులు.. ఆర్మ్డ్ పోలీస్‌లతో కట్టుదిట్టమైన భద్రత.. అసలు విషయం ఏంటంటే..

స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా అందరి ప్రసంశలు అందుకుంటుంది. ఓటీటీవేదిక విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Suriya: హీరో సూర్యకు బెదిరింపులు.. ఆర్మ్డ్ పోలీస్‌లతో కట్టుదిట్టమైన భద్రత.. అసలు విషయం ఏంటంటే..
Surya
Rajeev Rayala
|

Updated on: Nov 17, 2021 | 8:52 AM

Share

Suriya: స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా అందరి ప్రసంశలు అందుకుంటుంది. ఓటీటీవేదిక విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వన్నియార్ సంఘం ప్రతిష్ఠను గిగజార్చుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. అలాగే నిర్మాతలు సూర్య జోతిక , దర్శకుడు టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోల వన్నియార్ సంఘం నోటీసులు కూడా పంపింది. ఈ నేపథ్యంలో హీరో సూర్య కు కూడా పలు బెదిరింపులు వచ్చాయి. దాంతో సూర్యకు పోలీసులు బందోబస్త్ ను ఏర్పాటు చేశారు. చైన్నై లోని సూర్య నివాసంలో ఆర్మ్డ్ పోలీస్ లను ఏర్పాటు చేశారు. సూర్య ఇంటి లోపల ఐదుగురు సాయుధ పోలీసులను మోహరించారు. ఇదిలా ఉంటే జై భీమ్ సినిమాలో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ వన్నియార్ సంఘం  ఆరోపిస్తుంది.

ఈ సినిమాపై నెలకొన్న వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. జై భీమ్ సినిమాలో పై వన్నియర్ వర్గాల నేతలు విరుచుకుపడుతున్నారు. అంతేకాదు ఓ అడుగు ముందుకు వేసి.. తమ వర్గాన్ని కించపరిచిన నటుడు సూర్య ని కొట్టిన వారికీ ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని పీఎంకే నేతలు ప్రకటించి సంచలనం సృష్టించారు. జై భీమ్ సినిమాలో చాలా సన్నివేశాల్లో వన్నియర్ వర్గాన్ని కావాలనే అవమానించారంటూ పీఎంకే నేతల ఆరోపణ చేస్తున్నారు. రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జై భీమ్ నిర్మాత సూర్యకు వన్నియార్ సంగం నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

Sampoornesh Babu: “క్యాలీ ఫ్లవర్”తో మగాళ్లకు రక్షణ కల్పిస్తానంటున్న సంపూర్ణేష్ బాబు..

Tollywood Heroine: ఎవరో గుర్తించారా..? వెండితెరపై అలా మెరిసి.. ఇలా మాయమైంది

Sreemukhi : తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పిన బాబ్లీ బ్యూటీ.. శ్రీముఖికి అలాంటి వరుడే కావాలట..