Megastar Chiranjeevi: చిరు స్టెప్పేస్తే అలా ఉంటది.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల డ్యాన్స్ మూమెంట్స్ చేసిన నటుడిగా రికార్డ్‌లోకెక్కారు.

మెగాస్టార్ చిరంజీవికి అవార్డులు కొత్తేం కాదు. నంది అవార్జుల నుంచి పద్మ విభూషణ్ వరకూ ఎన్నో అవార్డులను అందుకున్నారు. అయితే ఇంకోసారి తెలుగువారు గర్వించేలా చేశారు చిరంజీవి. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి చిరంజీవి ఎక్కారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చిరుకి అందించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల డ్యాన్స్ మూమెంట్స్ చేసిన నటుడిగా రికార్డ్‌లోకెక్కారు. 1978లో సెప్టెంబర్ 22న చిరంజీవి తొలి సినిమా రిలీజ్ అయింది. తొలి సినిమా రిలీజ్ డేట్ రోజే గిన్నిస్ బుక్‌లో చోటు దక్కింది.
హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు చిరంజీవి కుటుంబ సభ్యులు, మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ పాల్గొన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు, సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, డైరెక్టర్ బాబీ తదితరులు హాజరయ్యారు.
ఈ విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరుకి గిన్నిస్ రికార్డు దక్కడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మెగాస్టార్‌కి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. “నేను ఎదురు చూడని గొప్ప గౌరవం ఇది. నటన కంటే డ్యాన్స్‌పై నాకు ఉన్న ఇష్టమే గిన్నిస్ రికార్డ్ రావడానికి కారణం అనుకుంటా. డ్యాన్స్ అనేది నాకు ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్. కొరియోగ్రాఫర్స్ వల్ల కూడా నా డ్యాన్స్‌లకు క్రేజ్ పెరిగింది. డ్యాన్స్‌కు అవార్డు వచ్చినందుకు సంతోషం” అని అవార్డ్ అందుకున్నాక చిరంజీవి వ్యాఖ్యానించారు. ఇక ఈ ఏడాది మొదట్లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‍ను చిరంజీవి అందుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




