AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: ‘నేను ఏసీ వ్యాన్‌లో నిద్రపోతే.. రజనీ నేలపై పడుకున్నారు’.. సూపర్ స్టార్‌పై అమితాబ్ ప్రశంసలు

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లో ఎంత స్టైల్ గా కనిపిస్తారో బయట అంతే సింపుల్ గా కనిపిస్తారు. భారత దేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో ఒకరైన రజనీ నిజ జీవితంలో చాలా సామాన్యుడిలా జీవిస్తారు. సాధారణ దుస్తులు ధరిస్తారు. మారువేషం దాచుకుని, బస్సులు, పార్కుల్లో తిరుగుతూ వార్తల్లో కనిపిస్తుంటారు.

Rajinikanth: 'నేను ఏసీ వ్యాన్‌లో నిద్రపోతే.. రజనీ నేలపై పడుకున్నారు'.. సూపర్ స్టార్‌పై అమితాబ్ ప్రశంసలు
Amitabh Bachchan, Rajinikanth
Basha Shek
|

Updated on: Sep 22, 2024 | 5:40 PM

Share

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లో ఎంత స్టైల్ గా కనిపిస్తారో బయట అంతే సింపుల్ గా కనిపిస్తారు. భారత దేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో ఒకరైన రజనీ నిజ జీవితంలో చాలా సామాన్యుడిలా జీవిస్తారు. సాధారణ దుస్తులు ధరిస్తారు. మారువేషం దాచుకుని, బస్సులు, పార్కుల్లో తిరుగుతూ వార్తల్లో కనిపిస్తుంటారు. రజనీకాంత్ సింప్లిసిటీ గురించి ఇప్పటికే అనేక కథనాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ప్రముఖ నటుడు, లెజెండ్ అమితాబ్ బచ్చన్ తాను చూసిన రజనీకాంత్ సింప్లిసిటీ గురించి గుర్తు చేసుకున్నాడు. స్టార్ డమ్ వచ్చిన తొలినాళ్లలో రజనీకాంత్ తమిళంలోనే కాకుండా కన్నడ, తెలుగు, కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం రజనీకాంత్ తనతో కలిసి హిందీ సినిమాల్లో నటించినప్పుడు ఎలా ఉండేవారో అమితాబ్ బచ్చన్ వివరించారు. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన చిత్రం ‘వెట్టేయన్’. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఈ దిగ్గజ నటులు మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఇటీవలే ‘వెట్టేయన్‌’ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానకి అమితాబ్ బచ్చన్ హాజరుకాలేదు కానీ తన వాయిస్ నోట్ పంపారు. ఇది షోలో ప్లే చేవారు.. రజనీకాంత్ గురించి బచ్చన్ మాట్లాడుతూ..

ఇవి కూడా చదవండి

‘హమ్’ సినిమా షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు రజనీకాంత్ విరామ సమయంలో నేలపై పడుకునేవారు. నేను మాత్రం నా ఏసీ వాహనంలో పడుకునేవాడిని. అయితే రజనీకాంత్ నేలపై పడుకోవడం చూసి నేను ఏసీ వాహనం నుంచి బయటకు వచ్చాను. రజనీకాంత్ స్టార్స్ అందరికంటే సుప్రీమ్ స్టార్’ అని ప్రశంసలు కురిపించారు అమితాబ్. కాగా వెట్టయాన్ అమితాబ్ మొదటి తమిళ సినిమా. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 10న సినిమా విడుదల కానుంది. సినిమాలో రజనీకాంత్ పోలీస్ పాత్రలో నటిస్తే, బచ్చన్ లాయర్ పాత్రలో నటించారు. ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, కన్నడ కిషోర్, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

33 ఏళ్ల తర్వాత మళ్లీ ఇద్దరూ ఒకే సినిమాలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
"డీల్ నచ్చకపోతే మళ్లీ బాంబులే!".. ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?