Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? స్టార్ నటి గారాల పట్టి.. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్ కూడా

ల్లి స్టార్ హీరోయిన్, తండ్రి స్టార్ ప్రొడ్యూసర్. అయితే తల్లిలాగా స్టార్ హీరోయిన్ కావాలంటూ ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందీ అందాల తార. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ నటించింది

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? స్టార్ నటి గారాల పట్టి.. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్ కూడా
Tollywood Actress
Follow us

|

Updated on: Sep 22, 2024 | 5:15 PM

పై ఫొటోలో మోడ్రన్ డ్రెస్ లో క్యూట్ గా కనిపిస్తోన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు తను మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్. గత కొన్ని నెలలుగా బాలీవుడ్ తో పాటు దక్షిణాది ఇండస్ట్రీలోనూ ఈ అమ్మడి పేరు మార్మోగిపోతోంది. తల్లి స్టార్ హీరోయిన్, తండ్రి స్టార్ ప్రొడ్యూసర్. అయితే తల్లిలాగా స్టార్ హీరోయిన్ కావాలంటూ ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందీ అందాల తార. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ నటించింది. పేరుకు బాలీవుడ్ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సొగసరి నటించిన ఒక తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. దీంతో ఈ హీరోయిన్ పేరు ఇప్పుడు నెట్టింట మార్మోగుతోంది. ఈ పాటికే చాలా మంది సినీ ఆడియెన్స్ కు అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో?యస్. ఈ క్యూటీ మరెవరో కాదు దేవర హీరోయిన్ జాన్వీ కపూర్. ఇది ఆమె టీనేజ్ ఫొటో.

బాలీవుడ్ లో ఇప్పటికే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది జాన్వీ కపూర్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎన్టీఆర్ డ్యూయర్ రోల్ చేస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచాయి. దేవర తర్వాత రామ్ చరణ్, బుబ్చిబాబు కాంబోలో రానున్న ప్రాజెక్టులో నటించనుంది జాన్వీ. ఇవే కాకుండా న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమాలో నటించనుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

దేవర సినిమాలో జాన్వీ కపూర్ స్టెప్పులు..

దేవరలో ఎన్టీఆర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.