Bholaa Shankar: స్పీడ్ పెంచిన మెగాస్టార్.. భోళాశంకర్ సినిమానుంచి క్రేజీ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. మెగాస్టార్ తనయుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. మెగాస్టార్ తనయుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర చేసినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడుచిరంజీవి వరుస సినిమాలను లైనప్ చేశారు. ఇప్పటికే మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ సిస్టర్ గా కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. అలాగే ఈ మూవీ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు చిరు.
తమిళ్ సూపర్ హిట్ వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరు. ఈ సినిమాకు బోళాశంకర్ అనే పవర్ ఫుల్ టైటిల్ ను అనౌన్స్ కూడా చేశారు. ఈ సినిమాలో కీర్తిసురేష్ మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. నేటినుంచి ఈసినిమా కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో ఓ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ షెడ్యూల్ మొదలవుతుందని మేకర్స్ తెలిపారు. దీని కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఓ భారీ సెట్ ను నిర్మించారని వెల్లడించారు. అలాగే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మెహర్ రమేష్. ఈ షెడ్యూల్ కు సంబంధించిన ఓ ఫోటోను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమన్నా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి