AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: ‘పుష్ప 2’ ప్లాన్‌లో చాలా మార్పులు చేస్తున్నారట సుకుమార్..కారణం ఏంటంటే

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపంచనంత ఊర మాస్ లుక్ లో కనిపించి మెప్పించాడు

Pushpa 2: 'పుష్ప 2' ప్లాన్‌లో చాలా మార్పులు చేస్తున్నారట సుకుమార్..కారణం ఏంటంటే
Pushpa 2
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2022 | 6:22 AM

Share

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప(Pushpa). ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపంచనంత ఊర మాస్ లుక్ లో కనిపించి మెప్పించాడు. బన్నీ సరసన రష్మిక మందన్న నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కరోనా కల్లోలం తర్వాత విడుదలై సంచనలన విజయం అందుకుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ భారీ విజయం అందుకోవడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మొదటి పార్ట్ కంటే సెంకడ్ పార్ట్ లో ఊహించని ట్విస్ట్ లు ఉండనున్నాయని తెలుస్తోంది. పుష్ప 2 కోసం సుకుమార్ పక్క ప్లాన్ రెడీ చేశారని తెలుస్తోంది.

‘పుష్ప 2’ ని మరిన్ని ప్రత్యేకతలతో మరింత స్పెషల్ గా తెరపైకి తీసుకురావాలని దర్శకుడు సుకుమార్ చూస్తున్నారు. గత నెల రోజులు గా సుకుమార్ ఈ సినిమా కథపై దృష్టిపెట్టారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల కేజీఎఫ్ 2 సినిమా దేశవ్యాప్తంగా సంచలన వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. పక్కా మాస్ హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కేజీఎఫ్ 2 తో పుష్ప2 ప్లాన్ కంప్లీట్ గా మారిపోయిందని తెలుస్తోంది. బడ్జెట్ నుంచి సినిమాలోని కీలక ఘట్టాల వరకు అన్నింటిని భారీ స్థాయిలో మార్చేశారట. అలాగే ఈ మూవీ కోసం దాదాపు రూ. 400 కోట్లు కేటాయించబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ సినిమా కథ పై కూడా చాలా వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..