Ram Charan: మెగా ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్.. చరణ్- శంకర్ సినిమా షూటింగ్ తాజా అప్డేట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఆ లేటెస్ట్ మూవీ RC 15. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan)నటిస్తున్న ఆ లేటెస్ట్ మూవీ RC 15. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న చరణ్ ఇప్పుడు శంకర్ సినిమా కోసం డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీని బడా ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. చరణ్, కియారా కలిసి గతంలో వినయ విధేయ రామ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీ ఫ్యాన్స్ ను ఖుష్ చేస్తున్న ఆ విషయం ఏంటంటే.. శంకర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసిందని అంటున్నారు. సైలెంట్ గా చరణ్, శంకర్ ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. ఈ సినిమా కోసం రకరకాల టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ మూవీ కోసం సర్కారోడు అనే టైటిల్ ను దాదాపు కన్ఫామ్ చేశారని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, అంజలీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.