కాబోయేవాడు ఇలానే ఉండాలి.. పెళ్లి పై మీనాక్షి చౌదరి క్లారిటీ మాములుగా లేదుగా..
2018లో ఫెమినా మిస్ ఇండియా విజేతగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రన్నరప్‌గా నిలిచింది అందాల భామ మీనాక్షి చౌదరి. సుశాంత్ హీరోగా చేసిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలో హీరోయిన్గా చేసింది. సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఈ బ్యూటీ స్క్రీన్ ప్రజెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి.

మీనాక్షి చౌదరి. సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ‘ఖిలాడీ’లో నటించి మెప్పించింది. మాస్ పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించింది. హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత అడివి శేష్ సరసన ‘హిట్-2’లో చేసింది. కెరీర్ బిగినింగ్ లో కాస్త స్లోగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. కెరీర్ స్టార్టింగ్ లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం అందుకుంది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారంలో నటించి మెప్పించింది.
ఇది కూడా చదవండి :ఎన్టీఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా అదరగొట్టిందిగా..
ఇవి కాక విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో నటించి మెప్పించింది. రీసెంట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది. అలాగే కొన్ని తెలుగు సినిమాలను ఓకే చేసింది. ఇవికాక పలు తమిళ సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. మొత్తానికి ఈ బ్యూటీ కొన్నాళ్లు తెలుగు ఇండస్ట్రీలో తన ముద్ర వేస్తుందన్న విషయం మాత్రం వాస్తవం. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మీనాక్షి క్రేజ్ తో పాటు ఆఫర్స్ కూడా పెరిగిపోయాయి. తెలుగు తమిళ్ లో అవకాశాలు అందుకుంటుంది ఈ వయ్యారి భామ.
ఇది కూడా చదవండి: ఈమెను మించిన హాట్ బ్యూటీ ఉంటుందా..! చేసింది రెండు సినిమాలు.. ఒకొక్క మూవీకి అందుకుంటుంది రూ.3 కోట్లు
అయితే సంక్రాంతి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంది మీనాక్షి చౌదరి. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ లోనే తన పెళ్లి గురించి కూడా క్రేజీ న్యూస్ చెప్పేసింది. తనకు కావాల్సిన మొగుడు ఎలా ఉండాలో చెప్పింది ఈ చిన్నది. తనకు కాబోయేవాడు అచ్చం తనలానే ఉండాలి అని తెలిపింది. తనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటా అని తెలిపింది. మొత్తానికి మీనాక్షి తనకు కాబోయే వాడు తన మేల్ వర్షన్ లా ఉండాలి అని తెలిపింది. ఇక సినిమాలతో పాటు, సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ ఫోటో షూట్స్ వదులుతూ అందరి దృష్టిని లాగేస్తోంది ఈ చిన్నది.
ఇది కూడా చదవండి: ప్రేమించినవాడి కోసం మతం మార్చుకుంది.. పేరు మార్చుకుంది.. చివరకు ఇలా
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..