Ponniyin Selvan I: మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్.. అదేంటంటే
ఈ సినిమాను మణిరత్నం అనౌన్స్ చేసి చాలా కాలమే అయ్యింది. అయితే అనుకోకుండా కరోనా రావడంతో ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయ్యింది. మొత్తంగా ఈ సినిమా మొదటి పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇటీవల కాలంలో రిలీజ్ అయిన భారీ బడ్జెట్ సినిమా పొన్నియన్ సెల్వన్. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమాలో భారీ తారాగణం ఉన్నారు. ఈ సినిమాను మణిరత్నం అనౌన్స్ చేసి చాలా కాలమే అయ్యింది. అయితే అనుకోకుండా కరోనా రావడంతో ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయ్యింది. మొత్తంగా ఈ సినిమా మొదటి పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అన్ని ప్రాంతాలనుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం నటించారు. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 30న ఈ సినిమా విడుదలైన ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీత దర్శకత్వం వహించగా..సీనియర్ రైటర్ జయమోహన్ డైలాగులు రచించారు.
తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. తమిళనాడు ఒక్క చోటే పొన్నియన్ సెల్వన్ 200 కోట్లను వసూల్ చేసింది. ఒక్క తమిళనాడులోనే 200 కోట్లను వసూలు చేసిన తొలి కోలీవుడ్ మూవీ ఇదేనని అంటున్నారు. ఈ అరుదైన రికార్డును పొన్నియన్ సెల్వన్ సొంతం చేసుకోవడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది.
తొలి రోజునే రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. అయితే తెలుగులో మాత్రం అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ మూవీ. ఇక త్వరలోనే ఈ సినిమా సెకండ్ పార్ట్ ను తెరకెక్కించనున్నారు మణిరత్నం.అలాగే అసలు కథ అంతా సెకండ్ పార్ట్ లోనే ఉంటుంది. మొదటి పార్ట్ కు మించి సెకండ్ పార్ట్ లో పోరాట ఘట్టాలు, ట్విస్ట్ లు ఉండనున్నాయని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..



