Manchu Manoj: అర్దరాత్రి ఫోన్ చేసి 5 లక్షలు అడిగా.. రామ్ చరణ్ రియాక్షన్ ఇదే.. మంచు మనోజ్ కామెంట్స్..

మ్ చరణ్ నాకు ప్రాణ మిత్రుడు.. అలాంటి నా స్నేహితుడి బర్త్ డే ఈవెంట్ కు ఇలా రావడం ఆనందంగా ఉంది.. ప్రతి సంవత్సరం అభిమానులు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తారు. రామ్ చరణ్ చిన్నతనం నుంచి తనతో ఉన్న స్నేహితులతో ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఈ కాలంలో అలాంటి స్నేహం దొరకడం చాలా కష్టం.. అందరూ స్థాయి పెరిగాక కొత్త స్నేహాలతో బిజీగా ఉంటారు.. పాత వారిని మార్చిపోతారు.

Manchu Manoj: అర్దరాత్రి ఫోన్ చేసి 5 లక్షలు అడిగా.. రామ్ చరణ్ రియాక్షన్ ఇదే.. మంచు మనోజ్ కామెంట్స్..
Manchu Manoj, Ram Charan
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 28, 2024 | 2:48 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు ఫ్యాన్స్. అటు బుధవారం హైదరాబాద్ వేదికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్, దర్శకనిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టార్స్, డైరెక్టర్స్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ గొప్పదనం గురించి హీరో మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. “రామ్ చరణ్ నాకు ప్రాణ మిత్రుడు.. అలాంటి నా స్నేహితుడి బర్త్ డే ఈవెంట్ కు ఇలా రావడం ఆనందంగా ఉంది.. ప్రతి సంవత్సరం అభిమానులు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తారు. రామ్ చరణ్ చిన్నతనం నుంచి తనతో ఉన్న స్నేహితులతో ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఈ కాలంలో అలాంటి స్నేహం దొరకడం చాలా కష్టం.. అందరూ స్థాయి పెరిగాక కొత్త స్నేహాలతో బిజీగా ఉంటారు.. పాత వారిని మార్చిపోతారు.

కానీ రామ్ చరణ్ ఎప్పటికీ తన స్నేహితులతో అలాగే ఉంటాడు. చెన్నైలో అందరం పక్కపక్కన ఉండేవాళ్లం. కష్టాల్లో ఉన్నవారికి చరణ్ సాయం చేస్తుంటాడు. ఓ కుటుంబం దుబాయ్ లో చిక్కుతుంది. ఆడబిడ్డ కష్టాల్లో ఉందని తెలిసి నా వంతు సాయం చేశాను. కానీ ఇంకా డబ్బు కావాల్సి వచ్చింది. అర్దరాత్రి ఫోన్ చేసి రామ్ చరణ్ 5 లక్షలు అడిగాను. ఆడబిడ్డకు కష్టం ఉందని చెప్పిన వెంటనే ఐదు లక్షలు పంపించాడు. అది చరణ్ గొప్పదనం ” అని అన్నారు మనోజ్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

రాంచరణ్ మంచి మనసుపై మంచు మనోజ్ కామెంట్స్..

అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..గేమ్ ఛేంజర్ అప్డేట్స్ ఇచ్చారు.. అప్డేట్స్ మరింత ఆలస్యం అవుతున్నాయని తను తిట్టుకోకండని .. కాస్త ఓపికతో ఉండండని సినిమాను శంకర్ అద్భుతంగా తీస్తున్నారని చెప్పుకొచ్చాడు. గ్లోబల్ స్థాయికి ఎదిగిన రామ్ చఱణ్ గేమ్ ఛేంజర్ సినిమా అదే స్థాయిలో ఉంటుందని చెప్పుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.