Aadu Jeevitham Twitter Review: 16 ఏళ్ల కష్టానికి ఫలితం.. పృథ్వీరాజ్ ‘ఆడుజీవితం’ సినిమాపై అడియన్స్ రెస్పాన్స్ ఇదే..

బెన్యామిన్ రచించిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మూవీపై క్యూరియాసిటిని కలిగించాయి. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ ప్రాణం పెట్టాు. దాదాపు 31 కేజీల బరువు తగ్గి పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇందులో అమలా పాల్ కథానాయికగా నటించింది. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు 16 ఏళ్ల క్రితమే ఈసినిమాతో తన ప్రయాణం మొదలైందని ఇటీవల మూవీ ప్రమోషన్లలో వెల్లడించారు పృథ్వీరాజ్.

Aadu Jeevitham Twitter Review: 16 ఏళ్ల కష్టానికి ఫలితం.. పృథ్వీరాజ్ 'ఆడుజీవితం' సినిమాపై అడియన్స్ రెస్పాన్స్ ఇదే..
Aadujeevitham Movei
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 28, 2024 | 8:24 AM

ఒకే ఒక్క సినిమా కోసం దాదాపు 16 సంవత్సరాలు కష్టపడ్డాడు మలయాళీ హీరో. ఇప్పుడు ఎట్టకేలకు పదహారేళ్ల నిరీక్షణకు తెరపడింది. అదే ది గోట్ లైఫ్.. తెలుగులో ఈసినిమాను ఆడు జీవితం పేరుతో రిలీజ్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించిన సినిమా ఇది. మార్చి 28న ఈ చిత్రాన్ని మలయాళంతోపాటు తెలుగులోనూ రిలీజ్ చేశారు. బెన్యామిన్ రచించిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మూవీపై క్యూరియాసిటిని కలిగించాయి. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ ప్రాణం పెట్టాు. దాదాపు 31 కేజీల బరువు తగ్గి పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇందులో అమలా పాల్ కథానాయికగా నటించింది. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు 16 ఏళ్ల క్రితమే ఈసినిమాతో తన ప్రయాణం మొదలైందని ఇటీవల మూవీ ప్రమోషన్లలో వెల్లడించారు పృథ్వీరాజ్.

ఇదిలా ఉంటే.. ఈరోజు ఆడు జీవితం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే సినిమా చూసిన అడియన్స్ ట్విట్టర్ వేదికగా ఈ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. పృథ్వీరాజ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని.. అతను ఇంతదూరం వెళ్తాడని ఎప్పుడూ అనుకోలేదని.. డైరెక్టర్ బ్లెస్సీ అద్భుతమైన సినిమాను తెరకెక్కించారని కమల్ హాసన్ అన్నారు.

ఈ సినిమా సెకండ్ హాఫ్ అందరిలో క్యూరియాసిటీ పెంచే విధంగా ఉంటుందని.. ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం గూస్ బంప్స్ అంటున్నారు. చాలా ఎపిసోడ్స్ రియాలిస్టిక్ గా అనిపిస్తాయని.. విజువల్స్ మాత్రం రియాల్టీకి దగ్గరగా ఉంటాయని.. ఇక ఎప్పటిలాగే పృథ్వీరాజ్ సుకుమార్ నటన.. లుక్స్ తో మరింత ఆకట్టుకున్నాడని తెలుస్తోంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీగా ప్రశంసలు కురిపిస్తున్నారు. దాదాపు పదాహారేళ్ల నిరీక్షణకు పృథ్వీరాజ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సినిమాను అందించారని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.