Siddharth-Aditi Rao: బాబోయ్.. అదితి కంటే సిద్ధార్థ్ ఎన్ని సంవత్సరాలు పెద్దవాడో తెలుసా ?.. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఏంతంటే..

2021లో విడుదలైన మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ్, అదితి కలిసి నటించారు. ఇందులో మరో హీరో శర్వానంద్ సైతం మెయిల్ లీడ్ గా కనిపించారు. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో జరిగిన పరిచయమే ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి ఈవెంట్స్, రెస్టారెంట్స్ కు వెళ్లడంతో వీరి ప్రేమ గురించి ప్రచారం మొదలైంది. అలాగే అదితికి సిద్ధార్థ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోను షేర్ చేయడంతో వీరి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది.

Siddharth-Aditi Rao: బాబోయ్.. అదితి కంటే సిద్ధార్థ్ ఎన్ని సంవత్సరాలు పెద్దవాడో తెలుసా ?.. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం  ఏంతంటే..
Siddharth, Aditi Rao Hydari
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 28, 2024 | 9:36 AM

టాలీవుడ్ లవర్ బాయ్ సిద్ధార్థ్.. హీరోయిన్ అదితి రావ్ హైదరీ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. చాలాకాలంగా ప్రేమలో ఉన్న వీరు ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. మార్చి 27న తెలంగాణలోని వనపర్తిలో రంగనాయకస్వామి ఆలయంలో వీరిద్దరి పెళ్లి జరిగినట్లుగా సమాచారం. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అయితే ఇద్దరూ తమ పెళ్లి వార్తలను ఇంకా ధృవీకరించలేదు. తమిళనాడు చెందిన పురోహితులు వీరిద్దరి వివాహన్ని హిందూ ఆచారాల ప్రకారం జరిపినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్ కానీ బయటకు రాలేదు. కానీ నిన్న జరిగిన హిరామండి మూవీ ప్రమోషన్లలోనూ అదితి కనిపించలేదు. దీంతో తన పెళ్లి కోసమే అదితి మూవీ ప్రమోషన్లలో పాల్గొనలేదనే ప్రచారం నడుస్తుంది.

2021లో విడుదలైన మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ్, అదితి కలిసి నటించారు. ఇందులో మరో హీరో శర్వానంద్ సైతం మెయిల్ లీడ్ గా కనిపించారు. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో జరిగిన పరిచయమే ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి ఈవెంట్స్, రెస్టారెంట్స్ కు వెళ్లడంతో వీరి ప్రేమ గురించి ప్రచారం మొదలైంది. అలాగే అదితికి సిద్ధార్థ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోను షేర్ చేయడంతో వీరి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఆ తర్వాత చాలా ఈవెంట్స్ లోనూ సిద్ధార్థ్, అదితి కలిసి సందడి చేయడంతో వీరి ప్రేమలో ఉన్నారనే విషయం కన్ఫార్మ్ అయ్యింది. కొన్నాళ్లుగా వీరి ప్రేమ విషయంపై రూమర్స్ పై వైరలవుతుండగా.. ఇద్దరూ స్పందించలేదు. కానీ మీకు తెలుసా ?. అదితి కంటే సిద్ధార్థ్ దాదాపు 7 సంవత్సరాలు పెద్ద.

అదితి 1986న అక్టోబర్ 28న హైదరాబాద్‌లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 37 సంవత్సరాలు. సిద్ధార్థ్ 1979 ఏప్రిల్ 17న చెన్నైలో జన్మించాడు. వీరిద్దరి మధ్య 7 సంవత్సరాలు వ్యత్సాసం ఉంది. ఇద్దరికి ఇది సెకండ్ మ్యారేజ్. గతంలో అదితి సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. అలాగే సిద్ధార్థ్ ఇంతకు ముందు తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనా నారాయణ్ ను వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం అదితి డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి సినిమాలో నటిస్తుంది. అలాగే సిద్ధార్థ్ ఇండియన్ 2లో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.