Manchu Manoj: ప్రేమ రెండువైపులా ఉండాలి.. నేను బతికి కూడా వేస్ట్.. మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్..

మార్చి 4న తన సోదరి మంచు లక్ష్మి నివారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఆ తర్వాత కుటుంబంతో కలిసి తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. తాజాగా కమెడియన్ వెన్నెల కిషోర్ హోస్ట్ గా నిర్వహిస్తోన్న అలా మొదలైంది షోలో పాల్గొన్నారు ఈ జంట. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

Manchu Manoj: ప్రేమ రెండువైపులా ఉండాలి..  నేను బతికి కూడా వేస్ట్.. మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్..
Manchu Manoj, Bhuma Mounika
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 14, 2023 | 8:56 AM

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇటీవలే భూమా మౌనికరెడ్డిని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే వీరి వివాహనికి ఎన్నో అడ్డంకులు రాగా.. వాటన్నింటిని కలిసి ఎదుర్కొని చివరకు ఇరువురు కుటుంబసభ్యుల సమక్షంలో ఏడడుగులు నడిచారు. స్నేహితులుగా మొదలైన వీరి ప్రయాణం.. ఆ తర్వాత ప్రేమగా మారి.. పెళ్లితో కలిసి మరో సరికొత్త జీవితాన్ని స్టార్ట్ చేసారు. మార్చి 4న తన సోదరి మంచు లక్ష్మి నివారం మనోజ్, మౌనిక పెళ్లి ఘనంగా జరిగింది. ఆ తర్వాత కుటుంబంతో కలిసి తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. తాజాగా కమెడియన్ వెన్నెల కిషోర్ హోస్ట్ గా నిర్వహిస్తోన్న అలా మొదలైంది షోలో పాల్గొన్నారు ఈ జంట. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో తమ పరిచయం.. పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

ఇందులో మౌనిక మాట్లాడుతూ.. “అమ్మ చనిపోయాక.. ఆమె పుట్టినరోజున అలా అకాశం చూస్తూ.. ఎక్కడున్నావ్.. నాకేం కావాలో నీకు తెలుసు. అంతా నీకే వదిలేస్తున్నాను అనుకున్నాను. ఆరోజు మనోజ్ ఆళ్లగడ్డకు వస్తాడని అనుకోలేదు. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను” అంటూ తన గతాన్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యింది.

ఇక ఆ తర్వాత మనోజ్ మాట్లాడుతూ.. “నేను వెళ్లాలి.. అక్కడే ఉండాలి అని మనమో ఊహించేసుకుని.. నేను అక్కడికి వెళ్లి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఇబ్బందులు పడ్డాను. మనం అనుకున్నట్లే ప్రేమించాం. కానీ ప్రేమ అనేది రెండు వైపులా ఉండాలి. ఎటు పక్క నిలబడుతున్నావో.. ఎక్కడున్నావో ఏం అర్థం కాలేదు. సరే నీకు లవ్ లైఫ్ కావాలా. సినిమా కావాలా సెలక్ట్ చేసుకో అనే పరిస్థితి కూడా వచ్చింది. మనల్ని నమ్ముకుని బిడ్డతో ఓ అమ్మాయి లైఫ్ నిలబడింది. నాకోసం. తనకు ద్రోహం చేస్తే ఈ జన్మకు నేను బతికి వేస్ట్ అనుకున్నాను. ” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే