AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bramayugam Movie: సూపర్ హిట్ ‘భ్రమయుగం’ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..

ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన లేటేస్ట్ హిట్ మూవీ టాలీవుడ్ లోకి రాబోతుంది. అదే 'భ్రమయుగం'. రైటర్ కమ్ డైరెక్టర్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ హారర్ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాను నైట్ షిప్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్స్ పై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించగా.. పాజిటివ్ రివ్యూస్ అందుకుంది.

Bramayugam Movie: సూపర్ హిట్ 'భ్రమయుగం' తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..
Bramayugam
Rajitha Chanti
|

Updated on: Feb 20, 2024 | 7:01 AM

Share

ప్రస్తుతం ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులోకి డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. కన్నడ, తమిళం, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలను ఇటు తెలుగు అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కాంతార, ట్రూ లవర్, మట్టి కుస్తీ, లియో చిత్రాలు తెలుగులో డబ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన లేటేస్ట్ హిట్ మూవీ టాలీవుడ్ లోకి రాబోతుంది. అదే ‘భ్రమయుగం’. రైటర్ కమ్ డైరెక్టర్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ హారర్ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాను నైట్ షిప్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్స్ పై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించగా.. పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. బ్లాక్ అండ్ వైట్ లో వచ్చిన ఈ మూవీలో మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు మమ్ముట్టి.

ఇందులో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ వంటి నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ మూవీని ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేయనుంది. ఈనెల 23న ఈ సైకలాజికల్ హారర్ సినిమాను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కథ విషయానికి వస్తే.. తన తల్లిని కలుసుకునేందుకు తేవన్ (అర్జున్ అశోకన్) ఒక అడవిలో వెళ్తూ దారి తప్పిపోతాడు. ఆకలితో తిరుగుతూ చివరకు ఓ పాడుబడిన ఇంటికి చేరుకుంటాడు. ఆ ఇంట్లో మనక్కల్ కుడుమోన్ (మమ్ముట్టి), అతని కుమారుడు (సిద్ధార్థ్ భరతన్) నివసిస్తుంటారు. అయితే ఆ ఇంట్లో పరిస్థితులు చూసి అనుమానం వచ్చి పారిపోవాలని ప్రయత్నిస్తాడు తేవన్. కానీ కుడమోన్ తాంత్రిక విద్య వల్ల తేవన్ అక్కడి నుంచి బయటపడలేకపోతాడు. చివరకు తేవన్ ఆ ఇంటి నుంచి ఎలా బయటపడ్డాడు ?.. కుడుమోన్ ఎవరు ?.. అన్నది తెలియాలంటే ‘భ్రమయుగం’ మూవీ చూడాల్సిందే. ఇక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.