AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricketer Shami: ‘తెలుగులో ఆ ఇద్దరు హీరోస్ అంటేనే చాలా ఇష్టం’.. క్రికెటర్ షమి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఇప్పుడు అందరి చూపు తెలుగు సినిమాలపైనే ఉంది. నార్త్ అడియన్స్, సెలబ్రెటీస్, క్రికెటర్స్ తెలుగు సినిమా పాటలకు స్టెప్పులేస్తున్నారు. మన డైరెక్టర్స్ మేకింగ్‏కు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే మన సినీతారలకు హాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ ఫ్యాన్స్ అయిపోయారు. తాజాగా టిమిండియా క్రికెటర్ షమి కూడా తెలుగు హీరోలకు వీరాభిమాని అన్న విషయం తెలిసిపోయింది. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహమ్మద్ షమీ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ..

Cricketer Shami: 'తెలుగులో ఆ ఇద్దరు హీరోస్ అంటేనే చాలా ఇష్టం'.. క్రికెటర్ షమి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Shami
Rajitha Chanti
|

Updated on: Feb 20, 2024 | 6:39 AM

Share

ప్రస్తుతం తెలుగు సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. బాహుబలి సినిమాతో హాలీవుడ్ సైతం టాలీవుడ్ పై దృష్టి సారించింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీకి వరల్డ్ వైడ్ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత కేజీఎఫ్, ట్రిపుల్ ఆర్, పుష్ప, కాంతార చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు అందరి చూపు తెలుగు సినిమాలపైనే ఉంది. నార్త్ అడియన్స్, సెలబ్రెటీస్, క్రికెటర్స్ తెలుగు సినిమా పాటలకు స్టెప్పులేస్తున్నారు. మన డైరెక్టర్స్ మేకింగ్‏కు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే మన సినీతారలకు హాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ ఫ్యాన్స్ అయిపోయారు. తాజాగా టిమిండియా క్రికెటర్ షమి కూడా తెలుగు హీరోలకు వీరాభిమాని అన్న విషయం తెలిసిపోయింది. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహమ్మద్ షమీ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ.. ఇక్కడి నటీనటుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. సౌత్ లో మీకు ఇష్టమైన యాక్టర్స్ ఎవరని అడగ్గా.. షమీ మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరూ తనకు ఇష్టమైన హీరోలు అంటూ చెప్పుకొచ్చారు.

“నాకు సౌత్ ఇండియన్ సినిమాలంటే చాలా ఇష్టం. నాకు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అంటే ఇష్టం” అని అన్నారు ప్రభాస్. అలాగే సౌత్, నార్త్ ఇండస్ట్రీల గురించి మాట్లాడారు షమీ. “నేను ప్రాంతీయ సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. నాకు సౌత్ మూవీస్ చాలా ఇష్టం. కానీ నాకు తమిళం, తెలుగు అర్థం కాదు..అందుకే డబ్బింగ్ సినిమాలు చూసేందుకు బాగుంటాయి” అని అన్నాడు. ప్రస్తుతం షమీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. గత కొన్నేళ్లుగా భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే అద్భుతమైన విజయాల్లో పాలు పంచుకున్నాడు. 33 ఏళ్ల షమీ.. ప్రస్తుతం చీలమండ గాయంతో క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. 2023 ODI ప్రపంచకప్ కోసం పోరాడాడు.. కానీ ఇందులో ఆస్ట్రేలియా గెలవగా.. భారత్ కు ఓటమి ఎదురైంది. CWC 2023లో 11 మ్యాచులలో కేవలం ఏడు మ్యాచ్ లు మాత్రమే ఆడారు. అయినప్పటికీ ఫ్లాగ్ షిప్ టోర్నమెంట్ లో అత్యధిక వికెట్స్ తీసిన ఆటగాడిగా నిలిచాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.