OTT Movie: మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఊహించని మలుపులు.. ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్..

ఓటీటీలోకి ప్రతివారం సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‏లు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లరి నరేష్ హీరోగా నటించిన బచ్చలమల్లి మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో విడుదలయ్యింది. ఈ క్రమంలోనే మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది.

OTT Movie: మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఊహించని మలుపులు.. ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్..
Secret Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 11, 2025 | 6:37 AM

మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. స్టార్స్ లేకుండానే వచ్చిన సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ శుక్రవారం ఓటీటీలోకి సరికొత్త చిత్రాలు వచ్చాయి. అందులో మలయాళంలో రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సీక్రెట్ ఒకటి. ఇందులో ధ్యాన్ శ్రీనివాసన్, అపర్ణ దాస్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ స్వామి దర్శకత్వం వహించగా.. గతేడాది జూలైలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్డీబీలో 7.3 రేటింగ్ సొంతం చేసుకుంది. దేవుడు, జాతకాలపై నమ్మకం లేని ఓ వ్యక్తి విధిని ఎదురించి ఎలాంటి పోరాటం చేశాడనే అంశాలతో ఆద్యంత మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఊహించని మలుపులతో ఈ చిత్రాన్ని రూపొందించాడు డైరెక్టర్ స్వామి.

థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ ఓటీటీలో ఈ సినిమా శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే మనోరమా మ్యాక్స్ ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. రెండు ఓటీటీలో కేవలం మలయాళం వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

కథ విషయానికి వస్తే..

మిథున్ (ధ్యాన్ శ్రీనివాసన్) తన ముగ్గురు ప్రాణ స్నేహితులతో కలిసి ఓ పెళ్లికి వెళతాడు. అనుకోకుండా అక్కడ ఓ జ్యోతిష్యుడిని కలుస్తాడు. మిథున్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి శ్రేయ తొందర్లోనే చనిపోతుందని జ్యోతిష్యుడు చెప్పడంతో జాతకాలపై నమ్మకం లేని మిథున్ అతడి మాటాలను పట్టించుకోడు. కానీ ఆ తర్వాత శ్రేయకు వరుసగా ప్రమాదాలు జరుగుతుంటాయి. శ్రేయను మిథున్ ఎలా కాపాడుకున్నాడు.. ? విధికి, నమ్మకాలకు మధ్య జరిగిన పోరాటంలో మిథున్ ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొన్నాడన్నదే కథ.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఊహించని మలుపులు..
మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఊహించని మలుపులు..
మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..!
మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..!
'మీ ఊహలకు మించి ఉంటుంది'..డాకు మహారాజ్‌పై అంచనాలు పెంచేసిన బాలయ్య
'మీ ఊహలకు మించి ఉంటుంది'..డాకు మహారాజ్‌పై అంచనాలు పెంచేసిన బాలయ్య
థీమాటిక్ ఇటిఎఫ్‌లు అంటే ఏమిటి? ఎవరు పెట్టుబడి పెట్టాలి?
థీమాటిక్ ఇటిఎఫ్‌లు అంటే ఏమిటి? ఎవరు పెట్టుబడి పెట్టాలి?
ఫోన్‌లో మాట్లాడుతూ రూ.1.51 కోట్లు దోచుకున్న నేరగాళ్లు..
ఫోన్‌లో మాట్లాడుతూ రూ.1.51 కోట్లు దోచుకున్న నేరగాళ్లు..
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది..
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది..
సోనామార్గ్‌కు అడ్డంకి లేదిక.. శ్రీనగర్‌కు మంచి రోజులే!
సోనామార్గ్‌కు అడ్డంకి లేదిక.. శ్రీనగర్‌కు మంచి రోజులే!
పాడ్‌క్యాస్ట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ..!
పాడ్‌క్యాస్ట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ..!
రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ రుణం
రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ రుణం
కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా
కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా