Suriya : క్రేజ్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్.. సూర్య సరసన మలయాళీ చిన్నది.. ఇంతకీ ఎవరీ వయ్యారి..
కోలీవుడ్ హీరో సూర్య సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హిట్టు, ప్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎప్పుడూ సరికొత్త కథలను అడియన్స్ ముందుకు తీసుకురావడంలో ముందుంటారు ఈ హీరో. అందుకే సూర్య సినిమాల కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు జనాలు. ఇటీవలే కంగువ మూవీలో నటించిన సూర్య.. ఇప్పుడు తన 45వ చిత్రంలో నటిస్తున్నారు.

తమిళ్ స్టార్ హీరో సూర్యకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. విభిన్నమైన కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఇటీవలే కంగువ చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చిన సూర్య.. ఇప్పుడు రెట్రో చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తన 45వ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు సూర్య. ఈ సినిమాకు నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తోన్న మూడవ సినిమా ఇది. . ప్రస్తుతం నటుడు సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తిగా మారిన కథాంశంతో గ్రామీణ శైలిలో రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు 60% పూర్తయిందని సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
లేటేస్ట్ సమాచారం ఈ సినిమాలో మలయాళీ యంగ్ హీరోయిన్ అనక మాయ రవి నటించనుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు అలప్పుజ జింఖానా చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న అనక రవి తాను సూర్య సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాని చెప్పడం గమనార్హం. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అనక రవి ఇప్పుడిప్పుడే కథానాయికగా వరుస ఆఫర్స్ అందుకుంటుంది. మలయాళంలో గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరోయిన్లలో ఈ అమ్మడు ఒకరు. మమ్ముట్టి, జ్యోతిక కలిసి నటించిన కాతల్ సినిమాలో వారి కూతురిగా కనిపించింది అనక రవి. ఇప్పుడు తమిళంలో సూర్య సరసన ఛాన్స్ కొట్టేసింది ఈ వయ్యారి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
