AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో విషాదం.. హోటల్‏లో శవమై కనిపించిన నటుడు.. అసలేం జరిగిందంటే..

ఇండస్ట్రీలో విషాదం చేసుకుంది. మలయాళీ నటుడు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు కళాభవన్ నవాస్ కన్నుమూశారు. శుక్రవారం ఆగస్ట్ 1న ఆయన తుదిశ్వాస విడిచారు. కొచ్చిలోని ఎర్నాకుళంలోని చోటానికరలోని తన హోటల్ గదిలో ఆయన అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. దీంతో గమనించిన సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఇండస్ట్రీలో విషాదం.. హోటల్‏లో శవమై కనిపించిన నటుడు.. అసలేం జరిగిందంటే..
Actor Kalabhavan
Rajitha Chanti
|

Updated on: Aug 02, 2025 | 10:06 AM

Share

మలయాళీ నటుడు, మిమిక్రీ ఆర్టిస్టు కళాభవన్ నవాస్ కన్నుమూశారు. కొచ్చిలోని ఎర్నాకుళంలోని చోటానికరలోని తన హోటల్ గదిలో ఆయన అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. గమనించిన సిబ్బంది వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కళాభవన్ వయసు 51 సంవత్సరాలు. ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..

కళాభవన్ గుండెపోటు కారణంగా మరణించారని తెలుస్తోంది. మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి శనివారం పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.’ప్రకంబనం’ అనే సినిమా షూటింగ్ ముగించుకుని సాయంత్రం తన హోటల్ గదికి వెళ్లిన కళాభవన్ ఆ తర్వాత బయటకు రాలేదు. ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో సిబ్బంది అతని గదిలోకి వెళ్లగా.. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు సినిమా షూటింగ్ నుంచి వచ్చినప్పుడు అతడు పూర్తిగా ఆరోగ్యంగగానే ఉన్నారని.. షూటింగ్ నుంచి రెండు రోజులు బ్రేక్ రావడంతో ఇంటికి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పాడని తోటి నటీనటులు తెలిపారు.

ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..