Kalki 2898 AD: మళ్లీ వెనక్కు తగ్గిన ‘కల్కి’ ?.. వాయిదా రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
ఇప్పటికే ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలకపాత్రలలో నటిస్తున్నారు. భారీ తారాగణం.. అంతకుమించిన భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండడంతో రోజు రోజుకీ ఈ మూవీపై హైప్ పెరిగిపోతుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రష్మిక మందన్నాతోపాటు.. మరికొందరు తారలు కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది.

వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలకపాత్రలలో నటిస్తున్నారు. భారీ తారాగణం.. అంతకుమించిన భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండడంతో రోజు రోజుకీ ఈ మూవీపై హైప్ పెరిగిపోతుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రష్మిక మందన్నాతోపాటు.. మరికొందరు తారలు కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకు కాస్త భారతీయ పురాణాలను లింక్ చేసి సరికొత్తగా రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ మూవీని ఈ ఏడాది మే 9న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా ఈ మూవీ గురించి అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి వీటిపై క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. ప్రభాస్‌కు సంబంధించిన జస్ట్ ది వార్మ్ అప్ అనే క్యాప్షన్ తో వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది మే 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ సరికొత్తగా విభిన్నంగా చేస్తుంది మూవీటీం. దీంతో కల్కి 2898 వాయిదా పడనున్న రూమర్స్ కు చెక్ పడింది.
ఇటీవల ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా. కల్కి లాంటి సినిమా ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు.. మొత్తం భారతీయ సినీ పరిశ్రమలోనే రాలేదని.. ఇలాంటి కోణంలో ఓ సినిమాను ఇప్పటివరకూ అసలు ఇండియాలోనే ఎవరూ తీయలేదని.. ఇది ఓ నెక్ట్స్ లెవల్ సినిమా అని.. థియేటర్లలో ఈ మూవీ చూస్తే హాలీవుడ్ చూసిన అనుభూతి కలుగుతుందని… తెలుగు సినిమా లేదా ఇండియన్ సినిమా అనే విషయాన్ని కూడా మర్చిపోతారని అన్నారు. దీంతో ఇప్పుడు కల్కి సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
Just the warm up… #Prabhas #Kalki2898AD on 𝐌𝐀𝐘 𝟗𝐭𝐡, 𝟐𝟎𝟐𝟒. pic.twitter.com/3cH1O3FffV
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



