‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ రివ్యూ

సినిమా: సరిలేరు నీకెవ్వరు నిర్మాణ సంస్థలు: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రచన – దర్శకత్వం: అనిల్‌ రావిపూడి నిర్మాతలు: అనిల్‌ సుంకర, దిల్‌ రాజు, మహేష్‌ బాబు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ కెమెరా: రత్నవేలు ఎడిటింగ్‌: తమ్మిరాజు తారాగణం: మహేష్ బాబు, రష్మిక మందన్న, విజయశాంతి, ప్రకాష్‌ రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్‌, సత్యదేవ్‌, అజయ్‌, సుబ్బరాజు, నరేష్‌, రఘుబాబు, సత్యం రాజేష్‌, […]

'సరిలేరు నీకెవ్వరు' మూవీ  రివ్యూ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 14, 2020 | 4:40 PM

సినిమా: సరిలేరు నీకెవ్వరు నిర్మాణ సంస్థలు: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రచన – దర్శకత్వం: అనిల్‌ రావిపూడి నిర్మాతలు: అనిల్‌ సుంకర, దిల్‌ రాజు, మహేష్‌ బాబు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ కెమెరా: రత్నవేలు ఎడిటింగ్‌: తమ్మిరాజు తారాగణం: మహేష్ బాబు, రష్మిక మందన్న, విజయశాంతి, ప్రకాష్‌ రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్‌, సత్యదేవ్‌, అజయ్‌, సుబ్బరాజు, నరేష్‌, రఘుబాబు, సత్యం రాజేష్‌, బండ్ల గణేష్‌, సంగీత, హరితేజ, తమన్నా తదితరులు విడుదల: 11.01.2020

మహేష్ బాబు, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. దాదాపు 13 ఏళ్ల తర్వాత మెడికల్‌ ప్రొఫెసర్‌ భారతి కేరక్టర్‌తో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమెతో పాటు సంగీత, బండ్ల గణేష్‌కి కూడా ఇది రీ ఎంట్రీ చిత్రమే. సరిలేరు నీకెవ్వరూ అనే థీమ్‌తో ఇప్పటికే మహేష్‌ మిలిటరీ యూనిఫార్మ్ బాగా పాపులర్‌ అయింది. వినోదానికి పెద్ద పీట వేసే అనిల్‌ రావిపూడి మార్క్ ఈ సినిమాలోనూ ఉంటుందా? బాధ్యతగా ఉండాలని చెప్పే మహేష్‌ ఈ సినిమాలో తీసుకున్న బాధ్యత ఏంటి? ఆలస్యం ఎందుకు..? చదివేయండి.

కథ మేజర్‌ అజయ్‌ (మహేష్‌బాబు) కాశ్మీర్‌లో ఉంటాడు. అతనున్న క్యాంప్‌కి ఇంకో అజయ్‌ (సత్యదేవ్‌) కూడా వస్తాడు. వారిద్దరూ చిన్న పిల్లలను కాపాడే మిషన్‌లో కలిసి పనిచేస్తారు. శత్రువు రెచ్చగొట్టే మాటలకు కొత్తగా వచ్చిన అజయ్‌ రియాక్ట్ అవుతాడు. దాని కారణంగా జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయస్థితికి చేరుకుంటాడు. అతని సోదరి వివాహం కుదిరిందన్న విషయం క్యాంప్‌ ఆఫీసర్‌ (మురళీశర్మ)కు అప్పటికే తెలుసు. అందుకే అతని స్థానంలో మేజర్‌ అజయ్‌ని , అతని ఇంటికి వెళ్లమని రిక్వెస్ట్ చేస్తాడు. అందుకు ఒప్పుకున్న మేజర్‌ అజయ్‌, మరో కొలీగ్‌ ప్రసాద్‌ (రాజేంద్రప్రసాద్‌)తో కలిసి కర్నూలు వెళ్తాడు. అక్కడ తన కొలీగ్‌ అజయ్‌ తల్లి ప్రొఫెసర్‌ భారతి (విజయశాంతి) సమస్యల్లో ఉన్న విషయాన్ని తెలుసుకుంటాడు. ఆమె కోసం మినిస్టర్‌ (ప్రకాష్‌రాజ్‌)ను కలుస్తాడు. ఇంతకీ భారతికి వచ్చిన సమస్య ఏంటి? దాన్ని మేజర్‌ అజయ్‌ ఎలా తీర్చాడు? అతనికి సంస్కృతి (రష్మిక) కుటుంబం ఎలా పరిచయమైంది? రైల్లో వాళ్ల వల్ల మేజర్‌ అజయ్‌కి ఏర్పడిన ప్రమాదం ఏంటి? క్రైమ్‌ బ్రాంచ్‌ కోటి ఎవరు? అతని వల్ల మేజర్‌ అజయ్‌కి ఉపయోగం జరిగిందా? లేదా? వంటివన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్‌ పాయింట్లు – నటీనటుల నటన – డైలాగులు – దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం – సెట్స్, లొకేషన్లు – కెమెరా పనితనం

మైనస్‌ పాయింట్లు – కథలో కొత్తదనం లేదు – విలనిజం బలంగా లేదు – స్క్రీన్‌ ప్లే

సమీక్ష మహేష్‌ స్టైల్‌లో అనిల్‌ రావిపూడి సినిమా ఉంటుందా? అనిల్‌ మార్క్ కామెడీ, మేనరిజమ్స్ తో మహేష్‌ మింగిల్‌ అవుతారా? సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్‌ వరకు ఫ్యాన్స్ మధ్య జరిగిన మేజర్‌ డిస్కషన్‌ ఇది. సినిమా చూసిన తర్వాత మాత్రం ఇద్దరి శైలీ కలిసింది అనే మాట అందరి నోటా వినిపిస్తోంది. ఎండనకా, వాననకా బార్డర్‌లో కాపలా కాసే మిలిటరీ వ్యక్తికి, సమాజంలో సాటి మానవుడు బాధ్యతగా ఉండకపోతే చిరాకు వస్తుంది. ఆ కాన్సెప్ట్ ని బేస్‌ చేసుకుని హీరో కేరక్టరైజేషన్‌ని రాసుకున్నారు అనిల్‌. నచ్చిన విషయాన్ని అమాయకంగా బయటపెట్టే కేరక్టర్లో హీరోయిన్‌…. ఆమె ఇష్టాయిష్టాల్ని గౌరవించే తల్లిగా సంగీత, సోదరిగా హరితేజ, సమాజాన్ని ఒడిసిపట్టేసినట్టు మాట్లాడే తండ్రిగా రావు రమేష్‌ నటించారు. బార్డర్‌లో ఉన్నా భయభక్తులతో మెలిగే వ్యక్తిగా రాజేంద్రప్రసాద్‌ మెప్పించారు. అక్రమార్జన చేసే మినిస్టర్‌ తరహా పాత్ర ప్రకాష్‌రాజ్‌కి కొత్తేమీ కాదు. 13 ఏళ్ల తర్వాత మళ్లీ మేకప్‌ వేసుకుని ఈ చిత్రానికి సైన్‌ చేశారు విజయశాంతి. మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్‌ భారతిగా, ముగ్గురి పిల్లల తల్లి పాత్రలో ఒదిగిపోయారు. ఇద్దరు కొడుకులను మిలిటరీకి పంపించిన గట్టి గుండె ఉన్న మహిళగా కనిపించారు. కన్న కొడుకు చనిపోయినప్పుడు కంటతడి పెట్టి, అతని త్యాగాన్ని తక్కువ చేయలేనని దృఢంగా చెప్పే తల్లి కేరక్టర్‌ ఆమెది. ఆద్యంతం ఎమోషన్‌ పండించారు. విజయశాంతి కోడలిగా కౌముది తన పరిధిమేర చక్కగా నటించారు. క్రైమ్‌ బ్రాంచ్‌ కోటిగా అజయ్‌, అతని అసిస్టెంట్‌గా కిశోర్‌ సినిమాలో ఫన్‌ ఎలిమెంట్స్ ఎలివేషన్‌కి పనికొచ్చారు. అలాగే ఫస్టాఫ్‌లో పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ పాత్రలు కూడా అనిల్‌ శైలిని రిఫ్లెక్ట్ చేశాయి. బండ్ల గణేష్ ట్రయిన్‌ ఎపిసోడ్‌లో కనిపించింది కాసేపే అయినా, నవ్వించారు. మియావ్‌ మియావ్‌ పిల్లి.. మిల్క్ బోయ్‌తో పెళ్లి, కొక్కొరొకో కొక్కొరొకో కోడీ… నీకూ నాకూ జోడీ వంటి రైమింగ్‌ లైన్స్ కూడా బావున్నాయి. నెవర్‌ బిఫోర్‌ నెవర్‌ ఆఫ్టర్‌ మేనరిజమ్‌ కూడా జనాల్లో బాగానే క్లిక్‌ అయింది. 14 ఏళ్లకే పెళ్లిచేసి… అని సంగీత పదే పదే చెప్పే డైలాగులో హాస్యం, విమర్శ రెండూ ఉన్నాయి. సొసైటీలో ఇప్పుడిప్పుడే కాస్త ఫోకస్‌ అవుతున్న మ్యారిటల్‌ రేప్‌ గురించి చూచాయగా చెప్పిన డైలాగ్‌ అది. దానికి తోడు భర్తలు నచ్చకపోయినా భార్యలు గుట్టుగా కాపురాలు చేసుకుంటున్నారనే డైలాగ్‌ రావు రమేష్‌ నోట వినిపిస్తుంది. ఆ డైలాగ్‌ కూడా మన సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసేదే. ఫన్నీగా కొన్ని డైలాగులు ఉన్నప్పటికీ హీరో సీరియస్‌గా చెప్పే కొన్ని డైలాగులు ఇంకా బావున్నాయి. ‘నాకు మీ అమ్మన్నా గౌరవమేరా’, ‘నీ గడప పాకిస్తాన్‌ బార్డరా’, బేరాల్లేవమ్మా’, ‘గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు…’ వంటి డైలాగులకు థియేటర్లో క్లాప్స్ పడుతున్నాయి. పాటలకు మహేష్‌ వేసిన స్టెప్పులు కూడా బావున్నాయి. కృష్ణ, మహేష్‌ చేసిన అల్లూరి సీతారామరాజు గెటప్పులను దర్శకుడు బాగానే వాడుకున్నాడు. కొండారెడ్డి బురుజు, విజయశాంతి ఇల్లు, ప్రకాష్‌ రాజ్‌ ఇల్లు సెట్స్ అంటే నమ్మబుద్ధి కాదు. అంత నేచురల్‌గా అనిపించాయి. దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు, నేపథ్య సంగీతం కూడా సినిమాకు హైలైట్‌. రత్నవేలు కెమెరా పనితనం, లొకేషన్లు బావున్నాయి. తమన్నా సాంగ్‌ స్పెషల్‌ ట్రీటే. అయితే, సినిమాలో నెక్స్ట్ ఏం జరగబోతుందనే విషయం ప్రేక్షకుడు సులువుగా పసిగట్టేలా ఉంది. కెమెరా, మ్యూజిక్‌, డైలాగ్స్… అంటూ ఇన్నిటి మీద ఫోకస్‌ చేసిన అనిల్‌ స్క్రీన్‌ ప్లే విషయంలో ఇంకాస్త ఫోకస్‌ చేయాల్సింది. విలనిజాన్ని మరింత బలంగా చూపించాల్సింది. ప్రతినాయకుడి బలాన్ని బట్టి, నాయకుడి బలాన్ని అంచనా వేయడం తెలుగు ఆడియన్స్ కి అలవాటు. ఆ విషయాన్ని మరికాస్త పట్టించుకుని ఉంటే బావుండేది. ఫైనల్‌గా… సరిలేరు… పండగ సందడే! – డా. చల్లా భాగ్యలక్ష్మి

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!