మాటల మాయావితో ‘సాహో’.. అన్నీ కుదిరితే రేర్ కాంబో!

తెలుగు తెరపై ఇప్పటివరకు అనేక రేర్ కాంబినేషన్స్‌ను చూశాం. ఇప్పుడు అదే కోవలో మరో క్రేజీ కాంబో రాబోతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్- రెబల్ స్టార్ ప్రభాస్.. వీళ్ళిద్దరూ కలిసి త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నారు. అవునండీ మీరు విన్నది నిజమే. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరికే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ కాంబినేషన్ సెట్ కావాలంటే.. కొన్ని సమీకరణాలు వర్కౌట్ కావాల్సి ఉంది. ఒకటి ‘వైకుంఠపురము’ హిట్ కావాలి, లేదా మంచి […]

మాటల మాయావితో 'సాహో'.. అన్నీ కుదిరితే రేర్ కాంబో!
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 11, 2020 | 4:27 PM

తెలుగు తెరపై ఇప్పటివరకు అనేక రేర్ కాంబినేషన్స్‌ను చూశాం. ఇప్పుడు అదే కోవలో మరో క్రేజీ కాంబో రాబోతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్- రెబల్ స్టార్ ప్రభాస్.. వీళ్ళిద్దరూ కలిసి త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నారు. అవునండీ మీరు విన్నది నిజమే. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరికే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

అయితే ఈ కాంబినేషన్ సెట్ కావాలంటే.. కొన్ని సమీకరణాలు వర్కౌట్ కావాల్సి ఉంది. ఒకటి ‘వైకుంఠపురము’ హిట్ కావాలి, లేదా మంచి టాక్ అయినా తెచ్చుకోవాలి. అలాగే ప్రభాస్ నటిస్తోన్న ‘జాన్’ సినిమా కూడా మే నెలకల్లా షూటింగ్ పూర్తి చేసుకోవాలి. ఇవి కుదిరితేనే ఈ కాంబినేషన్‌కు ఓ క్లారిటీ వస్తుంది.

అసలు త్రివిక్రమ్- ప్రభాస్ కలిసి ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ కుదర్లేదన్న విషయం విదితమే. ‘అల.. వైకుంఠపురములో’ సినిమా తర్వాత గురూజీ మరే చిత్రానికి కమిట్ కాకపోవడం వల్ల.. అదీ కూడా ప్రభాస్ ప్యాన్ ఇండియా, యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్స్ వదిలేసి కంప్లీట్ ఫ్యామిలీ సినిమా చేద్దాం అనుకుంటున్నాడు. అందువల్లే వీరి కాంబినేషన్ సెట్ అవుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. దీనికి కోసం ఓ బడా నిర్మాత రంగంలో దిగాడని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని టాలీవుడ్ టాక్.