ఆసీస్ జోరుకు టీమిండియా కళ్లెం వేస్తుందా.?
కొత్త సంవత్సరం వేళ టీమిండియా బోణీ కొట్టింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను చేజిక్కించుకుని ఫుల్ జోష్‌తో ఉంది. ఒక సిరీస్ ముగిసింది. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డేలకు సన్నద్ధమవుతోంది. ఇదిలా ఉండగా ఆసీస్ జట్టు ఇప్పటికే భారత్ చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇరు జట్ల మధ్య మొదటి వన్డే మంగళవారం ముంబైలో మొదలు కానుంది. మునుపటి మాదిరిగా ఆస్ట్రేలియా జట్టును తక్కువ అంచనా వేయడం అసాధ్యం. అప్పట్లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ జట్టుకు దూరంగా […]
కొత్త సంవత్సరం వేళ టీమిండియా బోణీ కొట్టింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను చేజిక్కించుకుని ఫుల్ జోష్‌తో ఉంది. ఒక సిరీస్ ముగిసింది. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డేలకు సన్నద్ధమవుతోంది. ఇదిలా ఉండగా ఆసీస్ జట్టు ఇప్పటికే భారత్ చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇరు జట్ల మధ్య మొదటి వన్డే మంగళవారం ముంబైలో మొదలు కానుంది.
మునుపటి మాదిరిగా ఆస్ట్రేలియా జట్టును తక్కువ అంచనా వేయడం అసాధ్యం. అప్పట్లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ జట్టుకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. వారి రాక జట్టులో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. సొంతగడ్డపై పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లను వైట్‌వాష్ చేయడమే దీనికి నిదర్శనం. అంతేకాకుండా ఆ టీమ్‌లో యువ కెరటం మార్నస్ లబూషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సరిగ్గా ఇదే రోజున గతేడాది 110వ ర్యాంక్‌లో ఉన్న అతడు.. అనూహ్యంగా ఇప్పుడు టెస్టుల్లో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ సరసన చేరిపోయాడు. టెస్టుల్లో ఉన్న ఫామ్‌ను వన్డేల్లో కూడా కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. అటు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు భారత్ పిచ్‌లు అచ్చొచ్చాయి. మరోవైపు వాళ్ళ టీమ్‌లో ఉన్న చాలామంది బౌలర్లకు కూడా ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. దీనితో ఈ సిరీస్ భారత్‌కు నల్లేరు మీద నడకలా ఉండడం అసాధ్యమని చెప్పవచ్చు.
ఇకపోతే భారత్‌ను సొంతగడ్డపై ఓడించడం కష్టమే. ఇది జగమెరిగిన సత్యం. కోహ్లీ అండ్ కో ఇప్పుడు సూపర్బ్ ఫామ్‌లో ఉన్నారు. అంతేకాకుండా జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టుకు అదనపు బలం తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ రెండు జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది. అంతేకాకుండా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని విశ్లేషకుల మాట.