AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నయానా లేదా భయానా… రెబల్స్‌పై కేటీఆర్ ఫోకస్

మునిసిపల్ ఎన్నికల్లో విజయం ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో రెబల్స్ బెడద నివారణకు కేటీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణలో అతిపెద్ద పార్టీగా వున్న టీఆర్ఎస్‌లోనే రెబల్స్ బెడద అధికంగా వుంది. కొన్ని డివిజన్లు, వార్డుల్లో అయితే ఏకంగా అయిదు నుంచి ఆరు మంది చొప్పున ఒక్క టిఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో చాలా మంది బీ-ఫామ్ తమదంటే తమదని చెప్పుకుంటున్నారు. వీరంతా బరిలోనే కొనసాగితే.. టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులకు షాక్ తగిలే అవకాశం […]

నయానా లేదా భయానా... రెబల్స్‌పై కేటీఆర్ ఫోకస్
Rajesh Sharma
|

Updated on: Jan 11, 2020 | 4:45 PM

Share

మునిసిపల్ ఎన్నికల్లో విజయం ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో రెబల్స్ బెడద నివారణకు కేటీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణలో అతిపెద్ద పార్టీగా వున్న టీఆర్ఎస్‌లోనే రెబల్స్ బెడద అధికంగా వుంది. కొన్ని డివిజన్లు, వార్డుల్లో అయితే ఏకంగా అయిదు నుంచి ఆరు మంది చొప్పున ఒక్క టిఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో చాలా మంది బీ-ఫామ్ తమదంటే తమదని చెప్పుకుంటున్నారు. వీరంతా బరిలోనే కొనసాగితే.. టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులకు షాక్ తగిలే అవకాశం వుంది.

నామినేషన్ల పర్వం ముగిసిన వెంటనే రంగంలో నిలిచిన రెబల్స్ అభ్యర్థులపై సంబంధిత ఎమ్మెల్యేలతో సమాలోచనలు మొదలు పెట్టారు కేటీఆర్. ఇందులో భాగంగా శనివారం ఉదయం నుంచి పలువురు ఎమ్మెల్యేలతో నేరుగాను, మరికొందరితో ఫోన్‌లోను మాట్లాడుతూ రెబల్స్ బెడదను వీలైనంత మేరకు తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాల్లో రెబల్స్ బెడద ఎక్కువగా వుండడంతో మంత్రి ప్రశాంత్ రెడ్డికి కేటీఆర్ కాల్ చేసి, డైరెక్షన్ ఇచ్చారు. దాంతో ఆయన రెబల్స్‌ని బుజ్జగించే పనిలో బిజీ అయిపోయారు. దాంతో ఆయన విజయం సాధించే సమీకరణలను గణించే పనిలో పడ్డారు. రెబల్స్‌ని బుజ్జగించేందుకు ఆయన నామినేటెడ్ పదవులను ఎరగా వేస్తున్నారు.

‘‘ పోటీ చేయాలని అందరికీ వుంటుంది. వారందరికీ టిక్కెట్ రాదు.. ఏ ఒక్కరికో దక్కుతుంది..మిగిలిన వారు సహకరించి, పార్టీ అభ్యర్థి విజయానికి పాటుపడాలంటూ‘‘ బుజ్జగింపు చర్యలను ముమ్మరం చేశారు మంత్రులు, ఎమ్మెల్యేలు. పార్టీ కోసం పని చేసే ప్రతీ ఒక్కరికి ఏదో ఒకరూపంలో గుర్తింపు లభిస్తుందన్న భరోసా ఇవ్వాలని కేటీఆర్ వారికి సూచించారు. దాంతో శని, ఆదివారాల్లో బుజ్జగింపులపై దృష్టి సారించే బాధ్యతలను ఆయన ఎమ్మెల్యేలకు, మంత్రులకు అప్పగించారు. ఈ బుజ్జగింపుల పర్వాన్ని హైదరాబాద్ నుంచి క్షణక్షణం పర్యవేక్షిస్తున్నారు కేటీఆర్.

తెలంగాణ భవన్‌లో తిష్ట వేసిన కేటీఆర్.. ఒక్కో ఎమ్మెల్యేను పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు.కేటీఆర్ పిలుపు మేరకు రెబల్స్ వెనుక వున్నారనుకుంటున్న నాయకులు తెలంగాణ భవన్‌కు క్యూ కట్టారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం ఫిర్యాదు చేయడంతో ఆయనను పిలిపించి రెబల్స్‌ని విత్ డ్రా చేయించే పని అప్పగించారు.

రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య మంత్రి తలసాని సంధి కుదర్చినప్పటికీ.. మహేందర్ రెడ్డి వర్గం వారు పెద్ద ఎత్తున రెబల్స్‌గా బరిలో దిగారు. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేటీఆర్‌ను కలిసి పరిస్థితి వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాాబాద్ శివారులోని బడంగ్‌పేట మునిసిపాలిటీలో తీగల కృష్ణారెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున రెబల్స్‌గా బరిలో దిగడంతో వారితోను కేటీఆర్ సంప్రదింపులు మొదలుపెట్టారు.

Follow Us
ఇవి అద్భుతమే..! రాత్రిపూట మెరిసే భారతదేశంలోని 5 మ్యాజికల్ బీచ్‌లు
ఇవి అద్భుతమే..! రాత్రిపూట మెరిసే భారతదేశంలోని 5 మ్యాజికల్ బీచ్‌లు
ఇంటర్‌ సప్లిమెంటరీ 2026 పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించలేదా?
ఇంటర్‌ సప్లిమెంటరీ 2026 పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించలేదా?
కవ్వించి పొదల్లోకి తీసుకెళ్తుంది.. ఆ తర్వాత....
కవ్వించి పొదల్లోకి తీసుకెళ్తుంది.. ఆ తర్వాత....
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త
అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌
అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌