ఆమె రాత్రిపూట రేటు మాట్లాడుకుని పక్కనున్న పొదల్లోకి తీసుకెళ్తుంది.. కాసేపటికి..
రాత్రివేళ రోడ్డుపై వలపు వల విసురుతూ అమాయకులను టార్గెట్ చేసిన దంపతుల అసలు బండారం నిజామాబాద్‌లో బయటపడింది. మహిళను ఎరగా వేసి.. తర్వాత అత్యాచారం కేసు పెడతామంటూ బెదిరించి డబ్బులు గుంజుతున్న జంటను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. .. ..

రాత్రి వేళ రోడ్డుపై ఒంటరిగా నిలబడి.. వెళ్తున్న వాళ్లను చూపులతో ఆపేస్తుంది ఆమె. మాటల్లో మాయ కలిపి దగ్గరకు రప్పిస్తుంది. బేరసారాలు మొదలవుతాయి. డీల్ సెట్ అయితే వాళ్లతో కలిసి వెళ్తుంది. అంతా సైలెంట్‌గా జరుగుతున్నట్టు కనిపించినా.. అసలు కథ అక్కడి నుంచే మొదలవుతుంది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికే ఎక్కడి నుంచో భర్త ఎంట్రీ ఇస్తాడు. ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు హంగామా చేస్తాడు. “నా భార్యతో ఎలా వచ్చావ్..?” అంటూ గొడవ మొదలెడతాడు. ఇదే సమయంలో ప్లాన్ ప్రకారం భార్య కూడా ప్లేటు ఫిరాయిస్తుంది. “నాపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు” అంటూ అరుపులు మొదలుపెడుతుంది. ఒక్కసారిగా షాక్‌కు గురైన వ్యక్తి ఏం జరిగిందో అర్థం కాక తడబడిపోతాడు.
అక్కడి నుంచే అసలు బ్లాక్‌మెయిల్ స్టార్ట్. “పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తాం.. రేప్ కేసు పెడతాం” అంటూ భయపెడుతూ డబ్బులు డిమాండ్ చేస్తారు దంపతులు. పరువు పోతుందనే భయంతో.. కేసుల్లో ఇరుక్కుపోతామనే టెన్షన్‌తో బాధితులు గత్యంతరం లేక డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఇలా గత 15 రోజులుగా నిజామాబాద్‌లో ఈ జంట హనీ ట్రాప్ దందా నడిపిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. వరుస ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీక్రెట్ నిఘా పెట్టి.. దంపతుల కదలికలను గమనించారు. చివరకు వాళ్ల ప్లాన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా క్యాప్చర్ చేసినట్టు సమాచారం.
ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ దంపతుల దగ్గర ఓ కత్తి కూడా పోలీసులు గుర్తించారు. ఎవరైనా ఎదురుతిరిగినా.. డబ్బు ఇవ్వడానికి నిరాకరించినా బెదిరించేందుకు దాన్ని ఉపయోగించాలని ప్లాన్ చేసినట్టు విచారణలో బయటపడింది. చివరికి డబ్బులు కోసం భార్యే ఎరగా వేశాడు ఈ ప్రబుద్ధుడు.. ఇలాంటి ఖతర్నాక్ కంత్రీలతో జర జాగ్రత్త బాస్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
