మద్యం తాగితేనే కానీ నిద్ర పట్టేది కాదు.. నిజాన్ని నిర్భయంగా చెప్పిన హీరోయిన్
11 May 2026
Pic credit - Instagram
Phani Ch
బాలీవుడ్ వెండితెరపై వెలిగిన అద్భుతమైన జంట రిషి కపూర్ మరియు నీతూ కపూర్. రిషి కపూర్ మరణం తర్వాత నీతూ జీవితం శూన్యంగా మారింది.
రిషి కపూర్ మరణించిన కొత్తలో నీతూ కపూర్‌కు అసలు ఏమీ తోచేది కాదట. ఇంట్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు పాత జ్ఞాపకాలు ఆమెను వెంటాడేవి.
ఆ సమయంలో తన పిల్లలు రణబీర్, రిద్ధిమ అండగా నిలిచినా, లోలోపల ఏదో తెలియని వెలితి ఆమెను నిరంతరం వేధించేదని, ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ బాధగా ఉంటుందని ఆమె చెప్పారు.
ఈ మానసిక వేదన నుండి తాత్కాలికంగానైనా ఉపశమనం పొందడానికి ఆమె తప్పుడు మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చిందని నిజాయితీగా ఒప్పుకున్నారు.
మనసును మొద్దుబార్చుకోవడానికి ఆమె ప్రతిరోజూ మద్యం సేవించడం ప్రారంభించారు. మద్యం తాగితే తప్ప ఆమెకు నిద్ర పట్టేది కాదు.
ఒకానొక దశలో మద్యం కూడా ఆమె బాధను తగ్గించలేకపోయింది. దీంతో మానసిక ప్రశాంతత కోసం, బలవంతంగా నిద్రపోవడానికి ఆమె వైద్యుల సలహాతో సెడెటివ్ ఇంజెక్షన్లు తీసుకోవడం ప్రారంభించారు.
తరువాత రణబీర్ కపూర్ తన తల్లిని బాగా ప్రోత్సహించారు. "అమ్మా, నువ్వు మళ్ళీ నీ పాత జీవితాన్ని ప్రారంభించాలి, నీకు ఇష్టమైన పని చేయాలి" అని ధైర్యం చెప్పారు.
కొడుకు ఇచ్చిన ఆ ధైర్యంతోనే నీతూ కపూర్ 'జుగ్ జుగ్ జీయో' సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి ఒప్పుకున్నారు. ఇది ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపుగా మారింది.