AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే.. ఆర్‌సీబీ స్టార్‌పై బీసీసీఐ ఫైర్.?

Tim David Obscene Gesture: ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ టిమ్ డేవిడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ముంబై, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా అసభ్యకరమైన సైగలతో సెన్సేషన్‌గా మారాడు. ఈ క్రమంలో ఆయనపై చర్యలు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధమైంది.

Video: ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే.. ఆర్‌సీబీ స్టార్‌పై బీసీసీఐ ఫైర్.?
Mi Vs Rcb Tim David Obscene GestureImage Credit source: https://x.com/MI_Fanverse
Venkata Chari
|

Updated on: May 11, 2026 | 4:48 PM

Share

Tim David Obscene Gesture: డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించి ప్లేఆఫ్ రేసు నుంచి అధికారికంగా హార్దిక్ సేనను తప్పించడమే కాకుండా, ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ అగ్రస్థానానికి చేరుకుంది. వరుసగా రెండు ఓటముల తర్వాత ఆర్‌సీబీ విజయం సాధించడంతో ఆటగాళ్లు తమ భావోద్వేగాలను ఆపుకోలేకపోయారు. కెప్టెన్ రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్యా గాలిలోకి ఎగిరి గంతులేయగా, టిమ్ డేవిడ్ మాత్రం తనదైన శైలిలో స్పందించాడు.

ముంబై మాజీ ఆటగాడైన ఈ ఆస్ట్రేలియన్ హిట్టర్, కార్బిన్ బోష్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీనివల్ల మ్యాచ్ ముంబై వైపు తిరిగినప్పటికీ, భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శనతో ఆర్‌సీబీ విజయం సాధించింది.

ముంబై మేనేజ్‌మెంట్‌పై టిమ్ డేవిడ్ ఆగ్రహం..?

మ్యాచ్ ముగిసిన తర్వాత టిమ్ డేవిడ్ అసభ్యకరమైన సంజ్ఞ చేస్తూ (రెండు మధ్యవేళ్లు చూపిస్తూ) కనిపించాడు. ఇది ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఉద్దేశించే చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో మూడు సీజన్ల పాటు ముంబైతో ఉన్న డేవిడ్‌ను, 2023లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ వారు వదులుకోవడం పట్ల అతను అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్‌సీబీలో టిమ్ డేవిడ్ పునర్జన్మ..

ముంబైలో సాధారణంగా ఉన్న డేవిడ్ ప్రదర్శన, ఆర్‌సీబీకి వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. 2025లో ఆర్‌సీబీ తొలి ట్రోఫీ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో కూడా 10 ఇన్నింగ్స్‌ల్లో 196.61 స్ట్రైక్ రేట్‌తో 232 పరుగులు చేసి జట్టుకు వెన్నెముకగా నిలిచాడు.

టిమ్ డేవిడ్‌పై నిషేధం విధిస్తారా?

ఐపీఎల్ నిబంధనల ప్రకారం (ఆర్టికల్ 2.6), మైదానంలో అసభ్య సంజ్ఞలు చేయడం లెవల్ 1 నేరం కిందకు వస్తుంది. దీనికి జరిమానా విధించే అవకాశం ఉంటుంది కానీ, నేరుగా నిషేధం విధించలేరు. ఒక ఆటగాడికి 36 నెలల కాలంలో నాలుగు డెమెరిట్ పాయింట్లు వస్తేనే నిషేధం ఉంటుంది. ఇప్పటికే డేవిడ్‌కు ఒక డెమెరిట్ పాయింట్ ఉండగా, మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. అయితే, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ మాత్రం లెవల్ 1 నిబంధన ఉల్లంఘన కింద ఇప్పటికే చర్యలు ఎదుర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us