నేను ఇప్పటికి ఇలా ఉండానికే కారణం అదే.. డైట్ సీక్రెట్ చెప్పిన లయ 

11 May 2026

Pic credit - Instagram

Phani Ch

చాలామంది సెలబ్రిటీలు కఠినమైన డైట్ ఫాలో అవుతుంటారు, కానీ లయ పద్ధతి మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది.

ఆమె డైట్ విషయంలో ఎప్పుడూ అతిగా ఆలోచించరట. "మనం తినే ఆహారం మన శరీరానికి సరిపడాలి కానీ, అది మనల్ని ఇబ్బంది పెట్టకూడదు" అని ఆమె నమ్ముతారు.

లయ ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తన రోజును ప్రారంభిస్తారు. ఇది శరీరంలోని మలినాలను తొలగించి, మెటబాలిజాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

అల్పాహారం విషయంలో ఆమె ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా మొలకెత్తిన విత్తనాలు లేదా ఇడ్లీ వంటి తేలికపాటి ఇంట్లో వండిన టిఫిన్లను మాత్రమే ఆమె తీసుకుంటారు.

మధ్యాహ్నం భోజనం విషయానికి వస్తే తక్కువ పరిమాణంలో అన్నం తీసుకుంటూ, ఎక్కువ మొత్తంలో ఆకుకూరలు మరియు పీచు పదార్థం ఉండే కూరలను తింటారు.

సాయంత్రం సమయంలో ఆకలి వేసినప్పుడు ఆమె పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. ముఖ్యంగా బాదం, వాల్‌నట్స్ వంటివి శరీరానికి మంచి శక్తిని ఇస్తాయని ఆమె సూచిస్తున్నారు.

టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీ లేదా కొబ్బరి నీళ్లను తాగడం వల్ల చర్మం తాజాగా మెరుస్తుందని లయ తన ఇంటర్వ్యూలో వివరించారు. ఇదే ఆమె గ్లో రహస్యం.

రాత్రి భోజనం పడుకోవడానికి కనీసం రెండు మూడు గంటల ముందే ఆమె డిన్నర్ పూర్తి చేస్తారు. రాత్రిపూట చాలా తేలికపాటి ఆహారం అంటే సూప్ లేదా జొన్న రొట్టె వంటివి తింటారు.