ఆ హీరోయిన్ అసలైన లేడీ సూపర్ స్టార్.. శ్రీలీల కామెంట్స్ వైరల్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

11 May 2026

టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తన డ్యాన్స్, నటనతో కుర్రకారు మనసు గెలుచుకుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమా పరిశ్రమలో తనకు నయనతార అంటే ఎంతో ఇష్టమని,  గౌరవమని తెలిపారు. ముఖ్యంగా తన కెరీర్‌ను మలుచుకున్న విధానం ఇష్టమన్నారు.

ఒడిదుడుకులను ఎదుర్కొని 'లేడీ సూపర్ స్టార్‌'గా ఎదిగిన తీరు తనకు ఎంతో స్ఫూర్తినిస్తుందని శ్రీలీల పేర్కొన్నారు. అలాగే ఆమె తన ఫేవరేట్ అన్నారు.

ఒక మహిళా నటిగా ఇండస్ట్రీలో దశాబ్ద కాలానికి పైగా తన ముద్రను వేయడం అంత సామాన్యమైన విషయం కాదని నయన్ పై ప్రశంసలు కురిపించింది.

నయనతారలో నచ్చిన విషయం ఆమె పట్టుదల, ప్రొఫెషనలిజం. సెట్స్‌లో ఎంత క్రమశిక్షణతో ఉంటారో, తన పాత్ర కోసం ఎంత కష్టపడతారో విన్నానని అన్నారు.

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథానాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ నయనతార సాధించిన విజయం సాధించిందని అన్నారు.

కెరీర్ ఆరంభంలోనే వరుస విజయాలను అందుకున్న శ్రీలీల, ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఉన్నారు. తెలుగులో బిజీ హీరోయిన్ గా మారింది.