Google Payలో ‘పాకెట్ మనీ’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా? ఈ ఆప్షన్ ఎవరి కోసం?
Google Pay New Features: గూగుల్ పే 'పాకెట్ మనీ' అనేది స్కామ్ కాదు. అది ఒక సురక్షితమైన ఫీచర్. అయితే, ఏదైనా కొత్త ఆప్షన్‌ను ఉపయోగించే ముందు దాని నియమ నిబంధనలను చదవడం మంచిది. సైబర్ నేరగాళ్లు ఇలాంటి కొత్త ఫీచర్ల పేరుతో..

Google Pay New Features: ప్రస్తుతం సోషల్ మీడియాలో గూగుల్ పే (Google Pay) లోని ‘పాకెట్ మనీ’ (Pocket Money) అనే ఆప్షన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఖాతాలోని డబ్బు మొత్తం మాయమైపోతుందని, ఇది ఒక రకమైన స్కామ్ అని కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ భద్రత విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉంటుందా? అసలు ఈ ‘పాకెట్ మనీ’ ఫీచర్ ఎవరి కోసం? దీని వల్ల ఉపయోగాలు ఏంటి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు ఏంటో ఈ ‘పాకెట్ మనీ’ ఫీచర్?
డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న గూగుల్ పే, కుటుంబ సభ్యులు, పిల్లల కోసం ‘UPI Circle’ ఫ్రేమ్‌వర్క్ కింద ఈ ‘పాకెట్ మనీ’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. తల్లిదండ్రులు తమ బ్యాంక్ ఖాతాను ఉపయోగించి పిల్లలకు డిజిటల్ పద్ధతిలో పాకెట్ మనీ ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. పిల్లలకు విడిగా బ్యాంక్ అకౌంట్ లేకపోయినా, తల్లిదండ్రుల అకౌంట్ ద్వారానే వారు చిన్న చిన్న చెల్లింపులు (స్కూల్ క్యాంటీన్, స్టేషనరీ మొదలైనవి) చేసుకునే అవకాశం కల్పించడం. దీనిపై పూర్తి నియంత్రణ తల్లిదండ్రుల చేతిలోనే ఉంటుంది.
ఇది కూడా చదవండి: India Gold Ban: బంగారం కొనుగోళ్లపై ప్రభుత్వం పూర్తి నిషేధం విధిస్తుందా? అసలు నియమాలు ఏమిటి?
‘పాకెట్ మనీ’ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
పరిమితి (Limit): తల్లిదండ్రులు తమ పిల్లల కోసం నెలకు గరిష్టంగా రూ.15,000 వరకు ఖర్చు పరిమితిని నిర్ణయించవచ్చు. పిల్లలు ప్రతిసారి పేమెంట్ చేసేటప్పుడు తల్లిదండ్రుల ఫోన్‌కు నోటిఫికేషన్ వస్తుంది. వారు అనుమతిస్తేనే డబ్బు కట్ అవుతుంది. ఒక ప్రధాన యూజర్ గరిష్టంగా ఐదుగురు సభ్యులను (పిల్లలు లేదా కుటుంబ సభ్యులు) యాడ్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలంటే ప్రభుత్వ గుర్తింపు కార్డులతో KYC పూర్తి చేయడం తప్పనిసరి.
గూగుల్ పే ‘పాకెట్ మనీ’ని సెటప్ చేయడం ఎలా?
UPI Circle విభాగానికి వెళ్లండి: గూగుల్ పే యాప్ తెరిచి, కుడివైపు పైన ఉన్న మీ ప్రొఫైల్ చిత్రంపై క్లిక్ చేయండి. అక్కడ మెనూలో ‘UPI Circle’ ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ కాంటాక్ట్ లిస్ట్ నుండి ఎవరిని (పిల్లలు/డిపెండెంట్స్) చేర్చాలనుకుంటున్నారో వారిని ఎంచుకోండి. వారు కూడా గూగుల్ పే ఇన్‌స్టాల్ చేసుకుని ఉండాలి. తల్లిదండ్రులు, పిల్లల ఫోన్‌లోని UPI Circle QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఇద్దరి మధ్య సురక్షిత అనుసంధానం ఏర్పడుతుంది.
చెల్లింపు విధానం ఎంచుకోండి: ఇక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి:
Full Delegation: మీరు నిర్ణయించిన పరిమితి (ఉదాహరణకు రూ.2000) లోపు పిల్లలు మీ అనుమతి లేకుండానే నేరుగా పేమెంట్ చేయవచ్చు.
Approve Each Payment: పిల్లలు ప్రతిసారి పేమెంట్ చేసేటప్పుడు మీ ఫోన్‌కు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఓకే అంటేనే డబ్బు వెళ్తుంది.
KYC, పిన్: మీ మధ్య సంబంధాన్ని ధృవీకరిస్తూ ప్రభుత్వ ఐడి వివరాలు ఇచ్చి మీ UPI పిన్ ఎంటర్ చేయడం ద్వారా సెటప్ పూర్తవుతుంది.
పిల్లలు చెల్లింపులు ఎలా చేయాలి?
సెటప్ పూర్తయిన తర్వాత పిల్లలు సాధారణ యూజర్లలాగే ఏదైనా షాపులో QR కోడ్ స్కాన్ చేసి లేదా మొబైల్ నంబర్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. వారు చేసిన ప్రతి ఖర్చు వివరాలు తల్లిదండ్రుల ఫోన్‌లోని ‘Transaction History’లో కనిపిస్తాయి. దీనివల్ల పిల్లలు డబ్బును ఎక్కడ, ఎంత ఖర్చు చేస్తున్నారో తల్లిదండ్రులు సులభంగా ట్రాక్ చేయవచ్చు.
గూగుల్ పే ‘పాకెట్ మనీ’ అనేది స్కామ్ కాదు. అది ఒక సురక్షితమైన ఫీచర్. అయితే, ఏదైనా కొత్త ఆప్షన్‌ను ఉపయోగించే ముందు దాని నియమ నిబంధనలను చదవడం మంచిది. సైబర్ నేరగాళ్లు ఇలాంటి కొత్త ఫీచర్ల పేరుతో తప్పుదారి పట్టించే అవకాశం ఉన్నందున, అధికారిక యాప్‌లో మాత్రమే ఇలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి.
ఇది కూడా చదవండి: Gold Import: భారత్‌కు బంగారం ఎక్కడి నుండి వస్తుంది? రోజువారీ అమ్మకాల లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!




