Washing Machine: వాషింగ్ మెషీన్ గంటకు ఎన్ని యూనిట్ల కరెంటు వాడుతుందో తెలుసా? ఒకసారి బట్టలు ఉతికితే అయ్యే ఖర్చు ఇదిగో!
Washing Machine Electricity Bill: ప్రముఖ రిటైల్ సంస్థ 'విజయ్ సేల్స్' గణాంకాల ప్రకారం.. సాధారణంగా 7KG వాషింగ్ మెషీన్ ఒక వాష్ సైకిల్‌కు (అంటే ఒకసారి బట్టలు ఉతకడానికి) సుమారు 0.25 నుండి 0.35 యూనిట్ల విద్యుత్‌ను ఖర్చు చేస్తుంది..

Washing Machine Electricity Bill: మనం కొత్త వాషింగ్ మెషీన్ కొనేటప్పుడు ఫీచర్ల మీద ఉన్న శ్రద్ధ, కొన్న తర్వాత కరెంటు బిల్లు మీద ఉంటుంది. ఒకసారి బట్టలు ఉతికితే ఎన్ని యూనిట్ల కరెంటు ఖర్చవుతుంది? నెలకు ఎంత బిల్లు వస్తుంది? అనే సందేహం అందరికీ వస్తుంది. సాధారణంగా ఇళ్లలో వాడే 7KG వాషింగ్ మెషీన్ ఒక గంటకు లేదా ఒక వాష్ సైకిల్‌కు ఎంత విద్యుత్‌ను వినియోగిస్తుందో పూర్తి లెక్కలతో ఇప్పుడు అర్థం చేసుకుందాం.
7KG వాషింగ్ మెషీన్ ఎంత విద్యుత్‌ను వాడుతుంది?
ప్రముఖ రిటైల్ సంస్థ ‘విజయ్ సేల్స్’ గణాంకాల ప్రకారం.. సాధారణంగా 7KG వాషింగ్ మెషీన్ ఒక వాష్ సైకిల్‌కు (అంటే ఒకసారి బట్టలు ఉతకడానికి) సుమారు 0.25 నుండి 0.35 యూనిట్ల విద్యుత్‌ను ఖర్చు చేస్తుంది.
దీనిని రూపాయల్లో లెక్కగడితే (యూనిట్‌కు రూ. 7 చొప్పున):
- కనీస ఖర్చు: 0.25 యూనిట్లు × రూ. 7 = రూ. 1.75
- గరిష్ట ఖర్చు: 0.35 యూనిట్లు × రూ. 7 = రూ. 2.45
ఒక గంట వాషింగ్‌కు ఎంత ఖర్చవుతుంది?
సాధారణంగా ఒక గంట వాష్ సైకిల్‌లో సుమారు 0.2 యూనిట్ల (రూ. 1.4) నుండి 0.4 యూనిట్ల (రూ. 2.8) విద్యుత్ ఖర్చవుతుంది. అయితే, మీరు బట్టలు ఉతికేటప్పుడు హీటర్ (వేడి నీరు) లేదా డ్రైయర్ ఎక్కువగా ఉపయోగిస్తే, ఈ వినియోగం ఒక్కో వాష్‌కు 1 నుండి 2 యూనిట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే ఒకేసారి రూ. 7 నుండి రూ. 14 వరకు బిల్లు పడవచ్చు.
విద్యుత్ వినియోగం దేనిపై ఆధారపడి ఉంటుంది?
వాషింగ్ మెషీన్ ఎంత కరెంటు వాడుతుందనేది ఈ కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది:
- హీటర్ వాడకం: వేడి నీటితో బట్టలు ఉతికితే విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుంది.
- స్టార్ రేటింగ్: 5-స్టార్ రేటింగ్ ఉన్న మెషీన్లు తక్కువ విద్యుత్తును వాడుతాయి.
- వాష్ మోడ్: ‘ఇకో వాష్’ (Eco Wash) లేదా ‘క్విక్ వాష్’ (Quick Wash) ఆప్షన్లను ఎంచుకుంటే కరెంటు ఆదా అవుతుంది.
- మీరు విద్యుత్ ఆదా చేయాలనుకుంటే వీలైనంత వరకు సాధారణ నీటితో, ఇకో మోడ్‌లో బట్టలు ఉతకడం మంచిది.
| వాష్ రకం | విద్యుత్ వినియోగం (Units) | అయ్యే ఖర్చు (రూ. 7/Unit చొప్పున) |
| ఒక సాధారణ వాష్ సైకిల్ | 0.25 – 0.35 Units | రూ. 1.75 – 2.45 |
| ఒక గంట పాటు వాడితే | 0.20 – 0.40 Units | రూ. 1.40 – 2.80 |
| హీటర్/వేడి నీటితో వాడితే | 1.00 – 2.00 Units | రూ. 7.00 – 14.00 |

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
