ఆయనంటే పడిచచ్చేంత ఇష్టం.. తెలుగులో నా ఫేవరేట్ హీరో అతడే.. సమంత..

Rajitha Chanti

Pic credit - Instagram

11 May 2026

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పదేళ్లకు పైగా సినిమాలతో బిజీగా ఉంటుంది. 

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే సమంతకు ఇష్టమైన టాలీవుడ్ హీరో ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. 

సమంతకు టాలీవుడ్‌లో అత్యంత ఇష్టమైన హీరో మరెవరో కాదు, 'సూపర్ స్టార్' మహేష్ బాబు. గతంలో పలు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.

మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని, ముఖ్యంగా ఆయన హ్యాండ్సమ్ లుక్స్‌కు తాను ఫిదా అని ఆమె పేర్కొన్నారు. హృతిక్ రోషన్ కంటే కూడా మహేష్ బాబు లుక్స్ ఇష్టమట.

 మహేష్ బాబు, సమంత కాంబినేషన్‌లో వచ్చిన 'దూకుడు' సినిమా ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'బ్రహ్మోత్సవం' వంటి చిత్రాల్లో కూడా నటించారు. ఆన్‌ స్క్రీన్ మీద వీరి కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి.

టాలీవుడ్‌లో మహేష్ బాబు తన ఫేవరేట్ అని సమంత చెప్పడం చూస్తుంటే, వారిద్దరి మధ్య ఉన్న వృత్తిపరమైన గౌరవం, స్నేహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

చాలా కాలంగా సినిమాలు తగ్గించినా సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాను త్వరలోనే అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.