కేరళలో అరుదైన రికార్డ్ సృష్టించిన బన్నీ మూవీ!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో చిత్రం మరికొన్ని గంటల్లో.. రికార్డ్ థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్ర ఆడియో ఒక రేంజ్‌లో హిట్ అయిన సంగతి తెలిసిందే. కాగా.. అల వైకుంఠపురంలో చిత్రం కేరళలో కొత్త రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ఏకంగా 30 బెనిఫిట్ షోస్‌ని కేరళలో ప్లాన్ చెయ్యడం విశేషం. కేరళలో డబ్బింగ్ సినిమాలకు ఇన్ని షోస్ వేయడం.. అరుదైన రికార్డ్‌గా […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో చిత్రం మరికొన్ని గంటల్లో.. రికార్డ్ థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్ర ఆడియో ఒక రేంజ్‌లో హిట్ అయిన సంగతి తెలిసిందే.
కాగా.. అల వైకుంఠపురంలో చిత్రం కేరళలో కొత్త రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ఏకంగా 30 బెనిఫిట్ షోస్‌ని కేరళలో ప్లాన్ చెయ్యడం విశేషం. కేరళలో డబ్బింగ్ సినిమాలకు ఇన్ని షోస్ వేయడం.. అరుదైన రికార్డ్‌గా చెప్పుకోవచ్చు.
గతంలో ఏ డబ్బింగ్ సినిమాలకు లేని విధంగా.. అల వైకుంఠపురంలో సినిమాకు షోస్ వేయడం విశేషం. అల్లు అర్జున్‌ని అక్కడి అభిమానులు ‘మల్లు అర్జున్’గా పిలుస్తూంటారు. ఒక తెలుగు స్టార్‌కు కేరళలో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం చెప్పుకోదగినదే.