Namrata Shirodkar: నమ్రత తిరిగి సినిమాల్లో నటించనున్నారా..? క్లారిటీ ఇచ్చిన మహేష్ సతీమణి

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. నమ్రత మిస్ ఇండియా గా కూడా ఎంపిక అయ్యారు.

Namrata Shirodkar: నమ్రత తిరిగి సినిమాల్లో నటించనున్నారా..? క్లారిటీ ఇచ్చిన మహేష్ సతీమణి
Namrata Shirodkar
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Jun 09, 2022 | 11:09 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సతీమణి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. నమ్రత మిస్ ఇండియాగా కూడా ఎంపిక అయ్యారు. 1993లో జరిగిన మిస్ ఇండియా మిస్ ఏషియా పసిఫిక్ గా ఎంపిక అయ్యారు. ఆ తర్వాత హీరోయిన్ గా మారారు.  ‘జబ్ ప్యార్ కిసీసే హోతాహై’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో దాదాపు 20 సినిమాల్లో నటించి మెప్పిచారు నమ్రత. అలాగే కన్నడ మలయాళ భాషల్లోనూ సినిమాలు చేశారు. ఇక బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ‘వంశీ’ సినిమాతో టాలీవుడ్ లో పరిచయం అయ్యారు నమ్రత. మహేష్ బాబు నటించిన ఈ సినిమాలో కృష్ణ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సమయంలోనే మహేష్ నమ్రత మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఈ ఇద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు.

పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ఇంటి వ్యవహారాలతో పాటు మహేష్ బాబు సినిమా ప్రమోషన్స్, డేట్స్ చూస్తూ బిజీగా మారిపోయారు. అలాగే మహేష్ కు సంబంధించిన బిజినెస్ లు, జీఎంబీ ప్రొడక్షన్స్ వంటి వ్యవహారాలను చూసుకుంటున్నారు నమ్రత.పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత నమ్రతా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు చాలా పుట్టుకొచ్చాయి. ఆ వార్తల్లో వాస్తవం లేదని నమ్రత చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా తన స్నేహితులు ఏర్పాటు చేసిన స్టైలింగ్ స్టోర్ ప్రారంభానికి నమ్రత హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకుంటూ.. మరోసారి తన రి ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు. ఫ్యాన్స్ నన్ను తిరిగి తెరపై చూడాలని ఆశపడుతున్నారు. కానీ నేను వాళ్ళను నిరాశపరుస్తూనే వచ్చాను. ప్రస్తుతం నేను నా ఫ్యామిలీని చూసుకోవడంలో చాలా బిజీగా ఉన్నాను. నా ఫ్యామిలీని చూసుకోవడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. అందుకే సినిమాల గురించి ఆలోచించడం లేదు.. ఆలోచించే అవకాశం కూడా రాకపోవచ్చు’ అని తెలిపారు. అలాగే మహేశ్ గురించి మాట్లాడుతూ..   ఫ్రీ టైమ్ దొరికిందంటే మహేష్ తో టూర్స్ కు వెళ్తుంటాం .. షాపింగ్ లు చేస్తామని చెప్పుకొచ్చారు నమ్రత. అలాగే మహేష్ తనతో కలిసి షాపింగ్ చేయడం కుదరదట .. మహేష్ షాపింగ్ కూడా తానే చేస్తా అని అన్నారు నమ్రత.

ఇవి కూడా చదవండి