Namrata Shirodkar: మరోసారి మంచి మనసు చాటుకున్న మహేశ్ సతీమణి.. ఏవియేషన్ విద్యార్థిని చదువుకు నమ్రత చేయూత
మహేశ్ అడుగుజాడల్లోనే నడుస్తోంది ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్. పిల్లల బాధ్యతలు, ఇంటి పనులు చూసుకోవడంతో పాటు మహేశ్ సినిమాలు, బిజినెస్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటోంది. ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ
సినిమాలే కాదు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. శ్రీమంతుడిగా ఇప్పటికే ఓ ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నాడాయన. అలాగే మహేశ్ ఫౌండేషన్ నెలకొల్పి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నాడు. ఇప్పటివరకు సుమారు 1000 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాడీ హ్యాండ్సమ్ హీరో. ఇక మహేశ్ అడుగుజాడల్లోనే నడుస్తోంది ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్. పిల్లల బాధ్యతలు, ఇంటి పనులు చూసుకోవడంతో పాటు మహేశ్ సినిమాలు, బిజినెస్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటోంది. ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ మహేశ్‌నే ఫాలో అవుతుంది నమ్రత. తాజాగా మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకుంది మహేశ్ సతీమణి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ లేడీ ఏవియేషన్ స్టూడెంట్ కి ప్రత్యేకంగా లాప్‌టాప్‌ని అందించింది. అదేవిధంగా ఆ విద్యార్థిని చదువుకయ్యే ఖర్చులని కూడా భరిస్తానని హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా అమ్మాయితో పాటు ఆమె తండ్రి కూడా మహేశ్- నమ్రత దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘ చదువుకునేందుకు నాకు అన్ని విధాలా చేయూత నందిస్తోన్న మహేశ్ బాబు గారికి, నమ్రతా మేడమ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని సదరు స్టూడెంట్ చెప్పుకొచ్చింది. అలాగే అమ్మాయి తండ్రి కూడా మహేశ్ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను సౌతిండియన్ ఫిల్మ్స్ పీఆర్ అండ్ మార్కెటింగ్ కన్సల్టెంట్ వంశీ శేఖర్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు మహేశ్ దంపతులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ఎంబీ 28 (వర్కింగ్ టైటిల్) అనే సినిమాలో నటిస్తున్నాడు మహేశ్. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సంయుక్తా మేనన్ సెకెండ్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సీనియర్ నటులు రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ సినిమా. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ వెల్లడించనుంది చిత్రబృందం.
On this #InternationalWomensDay2023, #NamrataMaheshGhattamaneni & @urstrulyMahesh sponsored laptop and educational support for a bright Aviation student through @MBfoundationorg. ❤️ #IWD2023 #WomensDay #MaheshBabu pic.twitter.com/hMqulMbiWw
— ??????????? (@UrsVamsiShekar) March 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..