Mahesh Babu: న్యూయర్ వేడుకల కోసం దుబాయ్‌కు మహేష్.. ఫ్యామిలీతో కలిసి సూపర్ స్టార్ వెకేషన్..
మహేష్ బాబు చేయి పట్టుకుని సితార నడుస్తుండగా.. ఆ పక్కనే నమ్రత, గౌతమ్ వెళ్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మహేష్ ఫ్యామిలీ న్యూయార్క్‌లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనున్నారని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు వీరంతా దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. దుబాయ్‍లో ఓ యాడ్ షూటింగ్ కోసం వెళ్లారని.. అలాగే అక్కడే న్యూయర్ సెలబ్రెషన్స్ జరుపుకోనున్నారని తెలుస్తోంది.

కొత్త సంవత్సరం రాబోతుంది. నూతన ఏడాది కోసం సామాన్య ప్రజలు, సెలబ్రేటీలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. చాలా మంది సినీతారలు న్యూయార్కు వెల్కమ్ చెప్పేందుకు విదేశాలకు ప్రయాణమయ్యారు. కుటుంబాలతో కలిసి అద్భుతమైన ప్రదేశాల్లో సరదాగా ఎంజాయ్ చేయనున్నారు. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ తారలు న్యూయార్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లగా.. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం కుటుంబంతో కలిసి జపాన్ వెళ్లారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లారు. శుక్రవారం ఉదయం తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు మహేష్.
మహేష్ బాబు చేయి పట్టుకుని సితార నడుస్తుండగా.. ఆ పక్కనే నమ్రత, గౌతమ్ వెళ్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మహేష్ ఫ్యామిలీ న్యూయార్క్‌లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనున్నారని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు వీరంతా దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. దుబాయ్‍లో ఓ యాడ్ షూటింగ్ కోసం వెళ్లారని.. అలాగే అక్కడే న్యూయర్ సెలబ్రెషన్స్ జరుపుకోనున్నారని తెలుస్తోంది.
Family time ♥️ family man 👌
Superstar #MaheshBabu #Namrata #sitara #gautam #GunturKaaram #GunturKaaramOnJan12th @urstrulyMahesh pic.twitter.com/b5kRFqenKx
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) December 29, 2023
Superstar @urstrulyMahesh off to Dubai for an AD shoot & a short vacation with Family ❤️🔥#GunturKaaram#MaheshBabu pic.twitter.com/xxXLU27dJ2
— Viswa CM (@ViswaCM1) December 29, 2023
న్యూయర్ సెలబ్రెషన్స్ కోసం అటు అల్లు అర్జున్ సైతం తన ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. అటు ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
Lucky fan 💥
Superstar gives selfie in style 👌😎#MaheshBabu #kurchimadathapetti #GunturKaaram @urstrulyMahesh pic.twitter.com/cCvGxyBAJw
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) December 29, 2023
Hyping up your new year!! Here’s the promo of #KurchiMadathapetti#TrivikramSrinivas @MusicThaman @sreeleela14 @Meenakshiioffl #RamajogayyaSastry @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine @adityamusic #GunturKaaramOnJan12th pic.twitter.com/tP9HPN8TvA
— Mahesh Babu (@urstrulyMahesh) December 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.