Mangalavaram: ఓటీటీలో ‘మంగళవారం’ స్ట్రీమింగ్.. అందరిచూపు ఆ అమ్మాడీ పైనే..

ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో 1990వ దశకంలో సాగే కథతో ఈ సినిమాను రూపొందించారు. గతనెల 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పాయల్ నటన చూసి అడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Mangalavaram: ఓటీటీలో 'మంగళవారం' స్ట్రీమింగ్.. అందరిచూపు ఆ అమ్మాడీ పైనే..
Divya Pillai
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 29, 2023 | 1:05 PM

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‏పుత్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా ‘మంగళవారం’. ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్ పై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ, A క్రియేట్ వర్క్స్ బ్యానర్ పై అజయ్ భూపతి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో 1990వ దశకంలో సాగే కథతో ఈ సినిమాను రూపొందించారు. గతనెల 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పాయల్ నటన చూసి అడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో చూసేయ్యొచ్చు.

అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది మరో నటి. ఆమె పేరు దివ్య పిళ్లై. మంగళవారం సినిమాలో నెగిటివ్ రోల్ పోషించింది. ఈ సినిమాలో జమీందార్ భార్య రాజేశ్వరీ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంప్రదాయ పద్దతిలో ఎంతో హుందాగా కనిపిస్తుంది. ఆమెను ఊరి ప్రజలు ఎంతో గౌరవిస్తుంటారు. కానీ క్లైమాక్స్ లో ఆమె గురించి అసలు విషయం తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో చర్చ స్టార్ట్ చేశారు నెటిజన్స్.

ప్రస్తుతం దివ్య పిళ్లై ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. మంగళవారం సినిమాలో ఆమె నటనకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దివ్య పిళ్లై మలయాళీ నటి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నయనతార నటించిన కాతువాకుల రెండు కాదల్ సినిమాలోనూ మెరిసింది. ఇప్పుడు మంగళవారం సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సెషన్ అవుతున్న ఈ హీరోయిన్ కు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Divya Pillai (@pillaidivya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.