AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Isha Koppikar: 14 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడాకులకు సిద్ధమైన ‘చంద్రలేఖ’ హీరోయిన్..

14 ఏళ్ల వైవాహిక బంధానికి వీరిద్దరు ముగింపు పలుకుతున్నారట. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతున్నారట. గతంలో విడాకులు తీసుకోవాలనుకున్నారట. కానీ విడిపోకుండా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. దీంతో కలిసి ఉండడం కంటే విడిపోవడం ఉత్తమం అని భావించారని.. గతనెలలో వీరి విడాకులకు అప్లై చేశారని తెలుస్తోంది.

Isha Koppikar: 14 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడాకులకు సిద్ధమైన 'చంద్రలేఖ' హీరోయిన్..
Isha Koppikar
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 29, 2023 | 3:15 PM

Share

సినీతారల విడాకుల వార్తలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటి వరకు బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడిపోతున్నారంటూ రూమర్స్ వినిపించాయి. ఇప్పటికే ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి బచ్చన్ ఇంటినుంచి బయటకు వచ్చిందని టాక్ నడిచింది. అయితే ఇటీవల ఆరాధ్య స్కూల్ వార్షికోత్సవ వేడుకలో బచ్చన్ ఫ్యామిలీ ఎంతో అన్యోన్యంగా కనిపించడంతో డివోర్స్ వార్తలకు చెక్ పడింది. ఇక ఇప్పుడు మరో జంట విడిపోతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఇషా కొప్పికర్ తన భర్త టిమ్మి నారంగ్‏తో విడిపోతున్నట్లు తెలుస్తోంది. 14 ఏళ్ల వైవాహిక బంధానికి వీరిద్దరు ముగింపు పలుకుతున్నారట. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతున్నారట. గతంలో విడాకులు తీసుకోవాలనుకున్నారట. కానీ విడిపోకుండా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. దీంతో కలిసి ఉండడం కంటే విడిపోవడం ఉత్తమం అని భావించారని.. గతనెలలో వీరి విడాకులకు అప్లై చేశారని తెలుస్తోంది.

ఇప్పటికే ఇషా తన కూతురిని తీసుకుని భర్త ఇంటి నుంచి బయటకు వచ్చేసిందని టాక్.. ఈ విషయం గురించి ఇషా మాట్లాడుతూ.. “నేనేమి చెప్పాలని అనుకోవడం లేదు. నాకు ప్రైవసీ కావాలి. దయచేసి అర్థం చేసుకోండి. ” అంటూ చెప్పుకొచ్చారట. దీంతో వీరిద్దరి విడాకుల రూమర్స్ నిజమేనని అంటున్నారు.

హీరోయిన్ ప్రీతి జింటా ద్వారా ఇషా, టిమ్మీ పరిచయమయ్యారు. మూడేళ్లు స్నేహితులుగా ఉన్న వీరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2009లో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2014లో రియానా అనే కూతురు జన్మించింది. 2000లో ఫిజా సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠి భాషల్లో నటించింది. తెలుగులో నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమాలో కథానాయికగా నటించింది ఇషా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.