Sarkaru Vaari Paata: గోవాలో మహేష్ బాబు.. యాక్షన్ ఎపిసోడ్ షూట్‌‌‌లో బిజీగా సూపర్ స్టార్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న

Sarkaru Vaari Paata: గోవాలో మహేష్ బాబు.. యాక్షన్ ఎపిసోడ్ షూట్‌‌‌లో బిజీగా సూపర్ స్టార్..
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 13, 2021 | 8:27 PM

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సూపర్ స్టైలిష్‌‌‌గా కనిపించనున్నాడు మహేష్. ఇటీవలే మహేష్ పుట్టిన రోజున విడుదలైన ‘బర్త్ డే బ్లాస్టర్’ రికార్డులను తిరగ రాస్తోంది. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న టీజర్‌‌‌‌గా ఈ బ్లాస్టర్ ఆల్ టైం రికార్డ్ నమోదు చేసింది. ఇప్పటి వరకు 31 మిలియన్ల వ్యూస్‌‌‌తో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇక ఇప్పటికే దుబాయ్ – హైదరాబాద్ లలో భారీ షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్ర బృందం.. తాజా షెడ్యూల్ షూటింగ్ కోసం గోవా పయనమయ్యారు. మహేశ్ బాబు తదితరులపై ఒక యాక్షన్ ఎపిసోడ్‌‌‌ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ.. ఈ సినిమా టీమ్ వర్కింగ్ స్టిల్‌‌‌ను విడుదల చేసింది. రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ ఆసక్తిని రేకెత్తిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ‘సర్కారు వారి పాట’సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ – GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తాజాగా విడుదల చేసిన పోస్టర్‌‌‌లో ఇందులో దర్శకుడు పరశురామ్ సన్నివేశం గురించి వివరిస్తుండగా.. మహేష్ బాబు ఆసక్తిగా వింటూ ఉన్నారు. ఈ ఫొటోలో రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్‌‌‌‌ని కూడా చూడొచ్చు. యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్ .. కామెడీతో కూడిన ఈ సినిమాను ‘సంక్రాంతి’ కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: ‘పుష్ప’ సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్ లుక్‏లో అదరగొట్టిన బన్నీ.. ఫ్యాన్స్‏కు ఇక పూనకాలే..

Bigg Boss 5 telugu: నెట్టింట్లో ‘బిగ్‏బాస్’‏ షో హల్‏చల్.. మరోసారి కంటెస్టెంట్స్ లీస్ట్ లీక్.. వైరల్‏గా మారిన ఆట సందీప్ ట్వీట్..

పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్