sarkaru vaari paata: “సర్కారు వారి పాట” మూవీ షూటింగ్ కు సిద్దమవుతున్న సూపర్ స్టార్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారిపాట. గీతగోవిందం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరక్కెక్కుతుంది.

sarkaru vaari paata: సర్కారు వారి పాట మూవీ షూటింగ్ కు సిద్దమవుతున్న సూపర్ స్టార్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 26, 2021 | 6:03 PM

sarkaru vaari paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారిపాట. గీతగోవిందం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరక్కెక్కుతుంది. ఈ సినిమాతో మొదటిసారి కీర్తిసురేష్ మహేష్ తో జత కడుతుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలనేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ న్యూ గెటప్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసినా పోస్టర్స్ లో మహేష్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన మహేష్ ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ కు తండ్రిగా మలయాళ సీనియర్ హీరో జయ్ రామ్ నటించబోతున్నాడని తెలుస్తోంది.

ఇక జయ్ రామ్ త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురంలో సినిమా నటించిన విషయం తెలిసిందే. ఇక సర్కారు వారిపాట సినిమాలో తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ సీన్స్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడట పరశురామ్ ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగు జరుపుకుని, రెండవ షెడ్యూల్ మొదలుపెట్టిన తరువాత కరోనా ఉద్ధృతి పెరిగింది. దాంతో షూటింగు ఆపేశారు. మళ్లీ అక్కడి నుంచే షూటింగును మొదలుపెట్టనున్నారు. మహేశ్ బాబు తదితరులు ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు. సుబ్బరాజు .. వెన్నెల కిషోర్ పాత్రలు చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారట. ఈ రెండు పాత్రలు నాన్ స్టాప్ గా నవ్విస్తూ ఉంటాయని చెబుతున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్- జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ -14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sitara Ghattamaneni: ముద్దు ముద్దుగా రైమ్‌ పాడుతున్న మహేష్ బాబు గారాల పట్టి సితార.. ( వీడియో )

Kajal Aggarwal: అలాంటి మూవీలనే నేను ఇష్టపడతా.. ఈ సినిమా కూడా అలాంటిదే..

Tollywood: ఆదిపురుష్ కోసం ప్ర‌భాస్‌కు 100 కోట్ల రెమ్యూన‌రేష‌న్..! ఈ లిస్ట్‌లో ఉన్న నెక్ట్స్ టాలీవుడ్ హీరో ఎవ‌రంటే..?